ఆంధ్రప్రదేశ్‌

ప్రశాంతంగా గ్రూపు-1 మెయిన్ పరీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 17: ఆరు రోజులపాటు జరుగనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 మెయిన్ రాత పరీక్షలు కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య గురువారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఇందుకుగాను విశాఖ, విజయవాడ, తిరుపతి, అనంతపురంలలో మొత్తం 13 పరీక్షా కేంద్రాలు ఏర్పాటయ్యాయి. 3900 మంది అభ్యర్థులు హాజరుకావాల్సి ఉండగా వీరిలో 63 శాతం మంది హాజరయ్యారు. పలు కేంద్రాలను కమిషన్ సభ్యులు పరిశీలించారు. 19,21,23,26,28 తేదీల్లో ఈ పరీక్షలు జరుగనున్నాయి.
ఆన్‌లైన్‌లో గ్రూప్-2 పరీక్ష జవాబు పత్రాలు
జూలై 15, 16 తేదీల్లో జరిగిన గ్రూప్-2 ప్రధాన పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు, జవాబు పత్రాలను ఏపిపిఎస్సీ వెబ్‌సైట్‌లో ఉంచారు. గత జూలైలో గ్రూప్-2 పరీక్షకు సంబంధించి తొలిసారిగా ఏ వివాదానికి తావులేని విధంగా ప్రతి అభ్యర్థి జవాబుపత్రాన్ని ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచినట్లు ఏపిపిఎస్సీ తెలిపింది. అయితే గీతం విశ్వవిద్యాలయంలో తలెత్తిన సాంకేతిక ఇబ్బంది ఆధారంగా నిరసనకు దిగిన కొందరి అభ్యర్థులను మాత్రం దీని నుంచి మినహాయించినట్టు ఏపిపిఎస్సీ కార్యదర్శి వైవిఎస్‌టి సాయి వెల్లడించారు.
గ్రూప్-2 ప్రకటన ద్వారా 982 పోస్టుల భర్తీకి ప్రాథమిక పరీక్ష ద్వారా మొత్తం 49,106 మందిని మెయిన్స్ పరీక్ష కోసం ఎంపిక చేశారు. వారిలో జూలై 15, 16 తేదీల్లో జరిగిన పరీక్షకు 45,228 మంది అభ్యర్థులు హాజరయ్యారు. త్వరలోనే గ్రూప్-2 ఫలితాలు వెల్లడించేందుకు సమాయత్తం అవుతున్నామని ఏపిపిఎస్సీ అధికారులు తెలిపారు.