ఆంధ్రప్రదేశ్‌

సిసిఈ ఫిట్‌మెంట్ ఫార్ములా తక్షణమే అమలుచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 17: 2010-13 సంవత్సరాల్లో డిగ్రీ అధ్యాపకులుగా పదోన్నతి పొందినవారికి ప్రభుత్వం తక్షణమే కమిషనరేట్ ఆఫ్ కాలేజి ఎడ్యుకేషన్ (సిసిఈ) ఫిట్‌మెంట్ ఫార్ములా అమలుచేయాలని ఏపి ప్రభుత్వ కళాశాలల గెజిటెడ్ అధ్యాపకుల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. గురువారం సంఘం ఆధ్వర్యంలో విజయవాడ గాంధీనగర్‌లోని ధర్నాచౌక్‌లో వివిధ జిల్లాలకు చెందిన డిగ్రీ అధ్యాపకులు పెద్దఎత్తున పాల్గొని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.్భస్కరరావు మాట్లాడుతూ గత 7 సంవత్సరాలుగా ఫిట్‌మెంట్ ఫార్ములా అమలుచేయకపోవడం వలన అధ్యాపకులు ఎంతో ఆందోళనకు లోనవుతున్నారన్నారు. 2015 నుండి తెలంగాణ ప్రభుత్వం అమలుపరుస్తున్నదని, మన రాష్ట్రంలో కూడా అమలుచేయాలంటూ అనేక పర్యాయాలు ప్రభుత్వానికి, అధికారులకు, ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలకు విన్నవించామని చెప్పారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు పిఆర్‌సిలో 42 శాతం ఇవ్వడంతో యుజిసి వేతనాలు అందుకున్న వారికంటే రాష్ట్ర ప్రభుత్వ వేతనాలు ఎక్కువగా పెరిగాయన్నారు. వాస్తవానికి పదోన్నతి పొందితే వేతనం పెరగాల్సి ఉండగా ఇక్కడ తగ్గుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఫిట్‌మెంట్ ఫార్ములా అమలుపరచడం ద్వారా సమస్యను పరిష్కరించాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగ సంఘం జెఏసి చైర్మన్ పి.అశోక్‌బాబు మాట్లాడుతూ అధ్యాపకుల డిమాండ్ న్యాయమైనదని, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్యను తొందరగా పరిష్కారం అయ్యేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు.