ఆంధ్రప్రదేశ్‌

కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 17: కాకినాడ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. కాని పిటిషన్లను విచారిస్తామని, తుది తీర్పుకు లోబడి ఎన్నికలు ఉంటాయని హైకోర్టు పేర్కొంది. ఎన్నికల నోటిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమైందని, ఈ దశలో కోర్టుల జోక్యం పరిమితంగా ఉంటుందని, షెడ్యూల్ ప్రకారం ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుందని హైకోర్టు స్పష్టం చేసింది. కాకినాడ మున్సిపల్ కార్పోరేషన్‌లో 48 వార్డులను నోటిఫై చేస్తూ ఏపి ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాలుచేస్తూ దాఖలైన మూడు పిటిషన్లను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి నవీన్ రావు విచారించారు. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత మున్సిపల్ కార్పోరేషన్‌ల రిజర్వేషన్‌ను రాష్ట్రప్రభుత్వం పునసమీక్షించలేదంటూ విలియమ్ హర్రీ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. విభజన కంటే ముందు జారీ చేసిన జీవో 94కు లోబడి రాష్ట్రప్రభుత్వం రిజర్వేషన్ల విధానాన్ని అమలు చేసిందని పేర్కొన్నారు. మున్సిపల్ కార్పోరేషన్‌లో కనీసం 50 వార్డులు ఉండాలని, కోర్టు ధిక్కార ప్రొసీడింగ్స్‌ను తప్పించుకునేందుకు అధికారులు చట్టాన్ని ఉల్లంఘించి వార్డులకు సరిహద్దులను తొందరపడి నిర్ణయించారని పిటిషనర్లు పేర్కొన్నారు. ఈ కేసులో మేడిశెట్టి ఈశ్వరరావు, తాడి భవాని ప్రసాద్ దాఖలు చేసిన పిటిషన్ల విచారణను అక్టోబర్ రెండవ వారానికి వాయిదా వేశారు. విలియమ్ హర్రీ దాఖలు చేసిన కేసు విచారణను ఈ నెల 30వ తేదీకి వాయిదావేశారు.