ఆంధ్రప్రదేశ్‌

పోరంకి-మచిలీపట్నం రోడ్డు వెడల్పు పనులకు బ్రేక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 17: కృష్ణా జిల్లాలో విజయవాడ పోరంకి-మచిలీపట్నం మధ్య జాతీయ రహదారి 65 రోడ్డు వెడల్పుకు సంబంధించి పనులకు హైకోర్టు స్టే ఇచ్చింది. తమ ఇండ్లను రోడ్డు వెడల్పు సందర్భంగా కూల్చివేసే ప్రయత్నాన్ని సవాలు చేస్తూ రమేష్ కిలారు మరో 71 మంది దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి జస్టిస్ ఏ రామలింగేశ్వరరావు విచారించారు. ఈ కేసులో న్యాయవాది రచనారెడ్డి వాదనలు వినిపిస్తూ రోడ్డు వెడల్పు కోసం సేకరించిన నిర్మాణాలు, భూమికి సంబంధించి నష్టపరిహారం చెల్లించలేదని కోర్టుకు తెలిపారు. మధ్యవర్తిత్వానికి పిటిషనర్లు సిద్ధంగా ఉన్నారని, ఈ కేసు కూడా పెండింగ్‌లో ఉందన్నారు. 2007 నుంచి 2009 మధ్య ఉన్న ధర ప్రకారం ప్రభుత్వం నష్టపరిహారం ధరను నిర్ణయించిందన్నారు. కాని భూసేకరణ చట్టం 2013కు విరుద్ధంగా ధరలను నిర్ణయించారన్నారు. అనంతరం ఈ కేసు విచారణను సెప్టెంబర్ 4కు వాయిదా వేశారు.