ఆంధ్రప్రదేశ్‌

టిడిపి, వైసిపిలకు ప్రతిష్ఠాత్మకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, ఆగస్టు 17: కాకినాడ నగర పాలక సంస్థ ఎన్నికలు అధికార తెలుగుదేశానికి, ప్రతిపక్ష వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారాయి. ఎన్నికలు వాయిదా పడే అవకాశం ఉండవచ్చన్న కారణంతో ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటివరకు ప్రచారంలో వెనుకంజ వేశాయి. అయితే కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు రాష్ట్ర హైకోర్టు గురువారం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ఎన్నికలపై ఉన్న సందేహాలు వీగిపోయాయి. దాదాపు 5 లక్షల జనాభా ఉన్న కార్పొరేషన్‌లో 50 డివిజన్లుండాలన్న నిబంధనలను తుంగలోకి తొక్కుతూ ఈ సంఖ్యను 48కి తగ్గించారని, ఇది కుట్రపూరితమైన చర్య అంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది. అయితే ఎన్నికల నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఎన్నికల కమీషన్ నోటిఫికేషన్ ప్రకారం ఈనెల 29వ తేదీన కార్పొరేషన్‌కు ఎన్నికలు జరిగేందుకు మార్గం సుగమం అయ్యింది. దీంతో ప్రధాన రాజకీయ పార్టీలైన తెలుగుదేశం, వైసిపి కాకినాడ కార్పొరేషన్‌లో జెండా ఎగురవేసేందుకు వ్యూహప్రతివ్యూహాల్లో ఉన్నాయి. ఈ ఎన్నికలను అధికార టిడిపి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. కాకినాడ కార్పొరేషన్‌లో బలమైన సామాజికవర్గంగా ఉన్న కాపులకే (మహిళ) మేయర్ పీఠాన్ని ఆ పార్టీ ప్రకటించింది. ముఖ్యంగా జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కిమిడి కళావెంకట్రావు, జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడును స్థానికంగా ఉండి, పార్టీ విజయానికి కృషిచేయాలని అధినేత చంద్రబాబు ఆదేశించినట్టు సమాచారం.
దీంతో ముగ్గురు మంత్రులు అభ్యర్థుల జాబితా ప్రకటన నుండి ఎన్నికలయ్యేవరకు పర్యవేక్షించడానికి రంగంలోకి దిగారు. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరినీ ఎన్నికల ప్రచారంలోకి దించారు. వార్డుల వారీగా అభ్యర్థులను గెలిపించే బాధ్యతలను ఎమ్మెల్యేలకు అప్పగించారు. అలాగే ప్రతిపక్ష వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నేతలు సైతం ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఆ పార్టీ రాష్ట్ర నాయకులు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, ఎంపి విజయసాయిరెడ్డి తదితరులు కాకినాడ నగరంలోనే మకాంవేశారు. మేయర్ పీఠాన్ని ఏ సామాజికవర్గానికి ఇచ్చేదీ అధికారికంగా ప్రకటించనప్పటికీ వీరు కూడా కాపు సామాజికవర్గ మహిళకే మేయర్ పీఠం అంటూ పరోక్షంగా సంకేతాలు పంపారు. ముఖ్యంగా నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో తెలుగుదేశానికి కాపులు తగిన బుద్ధి చెబుతారని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం వ్యాఖ్యానించడం, ముద్రగడ వైసిపికి అనుకూలంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతుండటంతో సదరు సామాజికవర్గం తమ పార్టీకే అనుకూలంగా ఉందన్న వ్యూహంతో వైసిపి ముందుకు సాగుతోంది. అయితే కాపుల్లో జరుగుతున్న ఈ ప్రచారానికి చెక్ పెట్టేందుకే మేయర్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ ముందుగానే కాపు మహిళకు కేటాయించినట్టు ప్రచారం జరుగుతోంది.