ఆంధ్రప్రదేశ్‌

పాదయాత్రకు అనుమతివ్వకపోతే ఇంటి గేటు బయటే బైఠాయిస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రత్తిపాడు, ఆగస్టు 17: పాదయాత్రకు అనుమతించని ప్రభుత్వం కనీసం మోకాళ్లపై నడవడానికైనా, లేదా పొర్లు దండాలకైనా అనుమతించాలని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం డిమాండ్‌చేశారు. శుక్రవారంలోగా అనుమతి ఇవ్వని పక్షంలో ఇకపై రోజూ తన ఇంటి గేటు ముందే ఉదయం నుంచి సాయంత్రం దాకా బైఠాయిస్తానని ముద్రగడ ప్రకటించారు. గురువారం సైతం ముద్రగడ పాదయాత్రను పోలీసులు నిలువరించిన సమయంలో ముద్రగడ ఈ విధంగా ప్రకటించారు. నల్ల చొక్కాలు ధరించిన జెఎసి నేతలతో కలిసి పాదయాత్రకు బయలుదేరిన ముద్రగడను 24వ రోజైన గురువారం కూడా పోలీసులు ఆయన ఇంటి మెయిన్ గేటు వద్దే అడ్డుకున్నారు. ఈసందర్భంగా ముద్రగడ మాట్లాడుతూ 144, 30 సెక్షన్లు కాపుజాతికేనా, సిఎంకి ఇతరులకు వర్తించవా అని ప్రశ్నించారు. ఇటీవల సిఎం చంద్రబాబు నిర్వహించిన సభలకు వందలాది వాహనాలతో పార్టీ కార్యకర్తలు తరలివెళ్లినపుడు ఈ రెండు సెక్షన్లు ఏమయ్యాయాని ప్రశ్నించారు. శుక్రవారం కూడా తన పాదయాత్రను పోలీసులు అడ్డుకుంటే, అడ్డుకున్నచోటే తాను బైఠాయిస్తానని ఈ సందర్భంగా ముద్రగడ ప్రకటించారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించే వరకూ తాను ప్రతి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకూ తన ఇంటి గేటు వద్దే నేలపైన కూర్చుంటానని పోలీసులతో చెప్పారు. అనంతరం మధ్యాహ్నం 12గంటల సమయంలో పలువురు కాపు నేతలు, యువత, మహిళలు ముద్రగడతోపాటు కంచాలపై గరిటెలతో వాయిస్తూ నిరసన తెలిపారు. తుని, ప్రత్తిపాడు, అమలాపురం, జగ్గంపేట, పెద్దాపురం, పిఠాపురం నియోజకవర్గాల నుంచి కాఫు సంఘాల నాయకులు ముద్రగడను కలిసి మద్దతు తెలిపారు. ముద్రగడ వారితో మాట్లాడుతూ కాపులకు రిజర్వేషన్ వచ్చే సమయం సమీపించిందని, ఇప్పుడే ఐకమత్యంగా అందరూ కలిసి నిరసన తెలపాలన్నారు.