ఆంధ్రప్రదేశ్‌

ఆయేషా మీరా కేసు పునర్విచారణ అనుమతికై కోర్టులో సిట్ పిటిషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), ఆగస్టు 17: ఆయేషామీరా హత్య కేసు పునర్విచారణకు అనుమతి కోరుతూ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అంతకుముందు సిట్ అధికారులు రాష్ట్ర డిజిపితో భేటీ అయ్యారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన బి ఫార్మసీ విద్యార్థిని ఆయేషామీరా కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం హాస్టల్‌లో దారుణ హత్య, అత్యాచారానికి గురైన విషయం తెలిసిందే. ఈకేసులో అప్పటి దర్యాప్తు అధికారులు కృష్ణాజిల్లా నందిగామ అనాసాగర్‌కు చెందిన పిడతల సత్యంబాబును అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చగా ప్రాసిక్యూషన్ వాదనలతో ఏకీభవించిన స్థానిక కోర్టు అతన్ని దోషిగా నిర్ధారించి శిక్ష విధించింది. దీంతో ఎనిమిదేళ్ళు రాజమండ్రి సెంట్రల్ జైలులో శిక్ష అనుభవించిన సత్యంబాబు ఇటీవలే హైకోర్టులో తీర్పుతో నిర్దోషిగా విడుదలైన విషయం తెలిసిందే. సత్యంబాబు జైలులో ఉండగా.. తన కుమారుడు నిర్దోషని, అన్యాయంగా శిక్షించారంటూ తల్లి మరియమ్మ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టులో వాదనల అనంతరం అమాకుడిని బలి చేశారనే డిఫెన్స్ కౌన్సిల్ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం ఇటీవల సత్యంబాబును విడుదల చేసింది. అతను నిర్దోషని పేర్కొంటూ, నష్టపరిహారం ఇవ్వాలంటూ ఆదేశించింది. అదేవిధంగా అప్పటి దర్యాప్తు అధికారులపై శాఖాపరమైన చర్యలకు ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో సత్యంబాబు నిర్దోషిగా జైలు నుంచి విడుదలయ్యాక.. కేసులో అసలు దోషులను పట్టుకోవాలని, సిబిఐ విచారణ కోరుతూ ఆయేషామీరా తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో కేసు పునర్విచారణకు అనుమతి కోరుతూ పోలీసుశాఖ ప్రభుత్వానికి లేఖ రాసింది. పునర్విచారణ కోసం విజయవాడ పోలీసు కమిషనర్ గౌతం సవాంగ్ పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తూ హోంశాఖ జీఓ విడుదల చేసింది. ఇదే విషయాన్ని హైకోర్టుకు తెలియచేసింది. సిట్‌లోని అధికారుల వివరాలు ఇవ్వాలని ఆదేశించగా.. వెంటనే డిఐజి శ్రీకాంత్, డిఎస్పీలు హైమావతి, శ్రీలక్ష్మీ, సిఐ సహేరాలను నియమిస్తూ కోర్టుకు తెలియచేసింది. ఇక కేసు పునర్విచారణ చేపట్టేందుకు శ్రీకారం చుట్టిన సిట్ బృందం గురువారం డిజిపి నండూరి సాంబశివరావును కలిసిన మీదట ప్రభుత్వ ముఖ్య న్యాయ సలహాదారు నాగరఘుతో భేటీ అయ్యారు.
చారు. ఆతర్వాత సిట్ బృందం నాలుగో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టుకు హాజరై విచారణకు అనుమతి కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఇదే సమయంలో ప్రభుత్వం ముఖ్య న్యాయ సలహాదారు నాగ రఘు తమ వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయమూర్తి యు ఇందిరాప్రియదర్శిని శుక్రవారానికి వాయిదా వేశారు.