ఆంధ్రప్రదేశ్‌

బ్రాహ్మణ సంక్షేమానికి రూ.200 కోట్లు వ్యయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఆగస్టు 17: బ్రాహ్మణ సంక్షేమానికి ప్రభుత్వం గత మూడేళ్లలో రూ.200 కోట్లు వ్యయం చేసిందని రాష్ట్ర ధర్మాదాయ దేవాదాయ శాఖ మంత్రి పైడికొండ మాణిక్యాలరావు వెల్లడించారు. గురువారం తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ 2016-17 ఆర్థిక సంవత్సరంలో బ్రాహ్మణ సంక్షేమానికి గాను 33,162 కుటుంబాలకు రూ.58 కోట్లు అందజేసినట్లు పేర్కొన్నారు. కాపులకు, బ్రాహ్మణులకే కాకుండా అగ్రవర్ణాల్లోని పేదలందరికీ ప్రభుత్వం ఆర్థిక పరపతి ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. దివ్యదర్శన పథకం ద్వారా రాష్ట్రంలోని 13 ఆలయాలను దర్శించడానికి ఉచిత రవాణా, బస్సు సౌకర్యాన్ని పేదలకు అందజేస్తున్నామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో వివిధ ఆలయాల నుంచి వచ్చే ఆదాయం 95 శాతం ఆలయాల ధూప దీప నైవేద్యం కోసం, సిబ్బంది జీతభత్యాలకు ఖర్చు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో పురాతన ఆలయాలను పునరుద్ధరించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. టిటిడి, ఎండోమెంట్ ఆధ్వర్యంలో రూ.250 కోట్లు ప్రత్యేక నిధిని ఏర్పాటుచేయడానికి ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు.