ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్రంలో అన్ని థియేటర్లలో ఆన్‌లైన్ టికెట్ల విక్రయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 17: రాష్ట్రంలోని అన్ని సినిమా థియేటర్లలో ఆన్‌లైన్ విధానంలో టికెట్ల విక్రయాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మేరకు ఇందుకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేసేందుకు ఒక కమిటీని నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే రాష్ట్రంలో కొన్ని థియేటర్లలో వివిధ సంస్థలు అన్‌లైన్‌లో టికెట్లను విక్రయిస్తున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో ఆన్‌లైన్ టికెట్ల విధానం అమలుకు ప్రభుత్వానికి రాష్ట్ర ఫిలిం, టెలివిజన్, ధియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎపిఎస్‌ఎఫ్‌టివిటిడిసి) ప్రతిపాదన పంపింది. ఈ మేరకు విధివిధాన రూపకల్పనకు, సినిమాటోగ్రఫీ చట్టంలో సవరణలు చేసేందుకు వీలుగా ఆరుగురితో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్ర హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చైర్మన్‌గా వ్యవహరించే ఈ కమిటీలో రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఐటి శాఖ సెక్రటరీ, ఎపిఎస్‌ఎఫ్‌టివిటిడిసి చైర్మన్, ఎండి, తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్సు అధ్యక్షుడు సభ్యులుగా వ్యవహరిస్తారు.