ఆంధ్రప్రదేశ్‌

గంగుల చేరికతో నంద్యాలలో హైడ్రామా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, ఆగస్టు 17: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన రాజ్యసభ మాజీ సభ్యుడు గంగుల ప్రతాపరెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరడంతో గురువారం ఉదయం నుంచి నంద్యాలలో హైడ్రామా నడిచింది. గంగుల చేరికను ఎవరూ ఊహించకపోవడం, ఆయనతో చర్చలు జరిపిన టిడిపి నేతలు సైతం రహస్యంగా మంతనాలు నిర్వహించి విషయాన్ని బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో మీడియాలో వార్తలు వచ్చేవరకు ఎవరికీ తెలియలేదు. భూమా బ్రహ్మానందరెడ్డి విజయంకోసం ప్రచారంలో ముమ్మరంగా పాల్గొంటున్న మంత్రి అఖిలప్రియ సహా పలువురు టిడిపి నేతలు గంగుల ప్రతాపరెడ్డి టిడిపిలో చేరారన్న వార్తతో కొద్దిసేపు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో పడ్డారు. భూమా కుటుంబం మినహా ఇతర టిడిపి నేతలు ఇక విజయం నల్లేరుపై నడకేనంటూ ఆనందభరితులు కావడం విశేషం. భూమా కుటుంబం గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ప్రచార కార్యక్రమాన్ని నిలిపివేసి ఇంట్లో సమాలోచనలు నిర్వహించింది. గంగుల ప్రతాపరెడ్డి టిడిపిలో చేరినందున ఆళ్లగడ్డ రాజకీయాల్లో తలెత్తే పరిణామాలపై ప్రధానంగా వారు చర్చించినట్లు సమాచారం. గంగుల చేరికతో పార్టీలో ఆయనకు లభించే పదవులు, తమకు ఎదురయ్యే ఇబ్బందులపై కూడా కుటుంబ సభ్యులు తమ అభిప్రాయాలను పంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై చంద్రబాబుతో సంప్రదించేందుకు మంత్రి అఖిలప్రియ, ఎమ్మెల్యే ఎస్వీ మోహనరెడ్డి ప్రయత్నించగా ఈ నెల 19వ తేదీ నంద్యాలకు వస్తున్నందున అక్కడే అన్ని విషయాలు చర్చిస్తానని చంద్రబాబు పేర్కొన్నట్లు తెలుస్తోంది. తనపై నమ్మకం ఉంచి ప్రచార కార్యక్రమాన్ని కొనసాగించాలని, ఎవరికీ ఇబ్బంది లేకుండా చూస్తానని ఆయన హామీ ఇవ్వడంతో మధ్యాహ్నం సమయంలో గంగుల ప్రతాపరెడ్డి చేరికపై మంత్రి అఖిలప్రియ మీడియా ఎదుట స్పందించారు. ఆయన చేరిక వల్ల తమకేమీ ఇబ్బంది లేదని, అదే సమయంలో నంద్యాల ఎన్నికల్లో ఆయన ప్రభావం ఉండదని పేర్కొనడం గమనార్హం. భూమా కుటుంబం పరిస్థితి ఇలా ఉండగా ఎంపి ఎస్పీవై రెడ్డి కుటుంబం సైతం గంగుల చేరికపై చర్చించినట్లు తెలుస్తోంది. నంద్యాల ఎన్నికల్లో భూమా బ్రహ్మానందరెడ్డి విజయం కోసం కృషి చేయాలని 2019 ఎన్నికల్లో ఎస్పీవై రెడ్డి కుటుంబానికి తాను న్యాయం చేస్తానని చంద్రబాబు ఇచ్చిన హామీని వారు గుర్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. గంగుల చేరికతో ఆయనకు ఏం హామీ ఇచ్చారో తెలుసుకునే ప్రయత్నం చేయగా 19న నంద్యాలలో అన్ని విషయాలు మాట్లాడదామని ఇచ్చిన హామీని మరువబోనని చంద్రబాబు హామీ ఇచ్చారని ఆయన వర్గీయులు పేర్కొంటున్నారు. వౌనంగా ఉంటూ టిడిపిలో చేరిన గంగుల ప్రతాపరెడ్డి నంద్యాల, ఆళ్లగడ్డ రాజకీయాల్లో అలజడి రేపాడంటూ చర్చించుకోవడం కనిపిస్తోంది.