ఆంధ్రప్రదేశ్‌

జనసేనలో రెండు విభాగాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 17: జనసేన పార్టీలో త్వరలో రెండు విభాగాలను ప్రారంభించనున్నట్టు ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ తెలిపారు. 2019 సార్వత్రిక ఎన్నికల సమయానికి పార్టీని పూర్తిస్థాయిలో సన్నద్ధం చేసే పనిలో పడిన పవన్‌కల్యాణ్ ఒక్కో విభాగానికి వూపిరి పోస్తున్నారు. ఇందులో భాగంగా అక్టోబర్‌లో పార్టీ తరఫున జనసేన విద్యార్ధి విభాగం, జనసేన మహిళా విభాగాలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఈ విభాగాల కోసం ఇప్పటికే విధి విధానాలను రూపొందించే పనిలో నిమగ్నమయ్యామని, అక్టోబర్‌లోనే వీటిని ఆచరణలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. అక్టోబర్‌లో వీలు కాని పక్షంలో ఈ ఏడాది ఆఖరునాటికి పూర్తిస్థాయి కమిటీలను అందుబాటులోకి తెస్తామని వివరించారు.