ఆంధ్రప్రదేశ్‌

తాజ్‌మహల్‌ను నాశనం చేయదల్చుకున్నారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 17: ప్రపంచ ప్రసిద్ధ తాజ్‌మహల్‌ను నాశనం చేయదల్చుకున్నారా? అంటూ సుప్రీంకోర్టు గురువారం నాడు కేంద్రప్రభుత్వాన్ని నిలదీసింది. ఉత్తరప్రదేశ్‌లోని మధుర నుండి ఢిల్లీకి అదనపు రైలు మార్గం కోసం తాజ్‌మహల్ సమీపంలో 400 చెట్లను కొట్టి వేయడాన్ని ప్రశ్నిస్తూ న్యాయవాది ఎంసి మెహతా దాఖలు చేసిన పిటీషన్‌ను విచారించిన సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం ఈ కటువైన మాటలను ఉపయోగించింది. ‘‘తాజ్‌మహల్ ప్రపంచ ప్రసిద్ధి చెందిన కట్టడం, దీనిని మీరు నాశనం చేయదల్చుకున్నారు తాజ్ మహల్ తాజా చిత్రాలను చూశారా? ఇంటర్‌నెట్‌లో తాజా చిత్రాలను చూడండి తెలుస్తుంది ’’ అంటూ సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి లోకుర్, జస్టిస్ దీపక్ గుప్తలతో కూడిన డివిజన్ బెంచ్ వ్యాఖ్యానించింది. మీరు కావాలంటే తాజ్‌మహల్‌ను నాశనం చేయదల్చుకున్నామంటూ ఒక అఫిడవిట్ దాఖలు చేయవచ్చు అని వ్యాఖ్యానించింది. తాజ్‌మహల్‌ను 1631లో నిర్మించారని, యునెస్కో పురావస్తు కట్టడంగా గుర్తించిందని పిటీషనర్ పేర్కొన్నారు. వాతావరణ కాలుష్య కారకాల నుండి తాజ్‌మహల్‌ను రక్షించాలని, తాజ్‌మహల్ ప్రాంతంలో అటవీ నిర్మూలనను అరికట్టాలని పిటీషనర్ కోరారు. సుప్రీంకోర్టు కేసు తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది.