ఆంధ్రప్రదేశ్‌

ఎంఎల్‌ఎ అనుచరుడి ఇంటిపై ఐటి దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు రూరల్, ఆగస్టు 17: నెల్లూరు జిల్లాలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ శాసనసభ్యునికి ప్రధాన అనుచరుడిగా కొనసాగుతున్న పొట్టెపాళెం గ్రామానికి చెందిన బండి శ్రీకాంత్‌రెడ్డి ఇంటిపై ఐటి దాడులు చేశారు. గురువారం ఉదయం ఆరు గంటల నుండి ఈ దాడులు ఏకధాటిగా కొనసాగుతూ ఉన్నాయని, ఈ దాడుల సందర్భంగా పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. పెద్దనోట్ల నిషేధం సమయంలో శ్రీకాంత్‌రెడ్డి బ్యాంక్ అకౌంట్ ద్వారా పలు మార్గాల్లో నగదు మార్పిడి చేశాడన్న సమాచారం ఐటి అధికారులకు అందిన సమాచారం మేరకు దాడులు నిర్వహిస్తున్నట్లు వినికిడి. శ్రీకాంత్‌రెడ్డి ఇసుకకు సంబంధించి కూడా లావాదేవీలున్నట్లు విచారణలో బయటపెట్టినట్లు సమాచారం. గుంటూరుకు చెందిన ఐటి అధికారులు గురువారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో శ్రీకాంత్‌రెడ్డి ఇంట్లోకి ప్రవేశించి ఇల్లును పూర్తి తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. అయితే విషయం బయటకు పొక్కనీయకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకున్నప్పటికి సమాచారం బయటకు పొక్కింది. గ్రామం కావడంతో ఒకకసారిగా ఏమి జరుగుతోందని గ్రామస్తులు శ్రీకాంత్ ఇంటి ముందు భారీగా గుమిగూడటంతో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ దాడులు నోట్ల రద్దుకు సంబంధించి భారీ స్థాయిలో నోట్ల మార్పిడి జరిగిందన్న పక్కా సమాచారం ఐటి అధికారుల వద్ద ఉండటంతోనే ఈ దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ దాడిలో నెల్లూరు, గుంటూరుకు చెందిన ఐటి శాఖ అధికారులు పాల్గొన్నారు.