ఆంధ్రప్రదేశ్‌

ప్రపంచ యాత్రకు మహిళా నావికులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 17: భారత నౌకాదళానికి చెందిన మహిళలు సముద్రంపై ప్రపంచ యాత్ర చేయడానికి సన్నద్ధమయ్యారు. నావికా సాగర్ పరిక్రమ ప్రాజెక్ట్‌లో భాగంగా మహిళా నావికులు ఈ యాత్రకు వచ్చే నెల మొదటి వారంలో బయల్దేరనున్నారు. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఐఎన్‌ఎస్‌వి తరణిలో దేశంలోని వివిధ ప్రాంతాల్లోని నౌకాదళ కమాండ్‌లకు చెందిన ఆరుగురు మహిళలు అత్యంత సాహసోపేతమైన ఈ యాత్రకు బయల్దేరనున్నారు. సుమారు 21,600 నాటికల్ మైళ్ల దూరం వీరు ప్రయాణించనున్నారు. భారత నౌకాదళంలో మహిళా శక్తిని ప్రపంచానికి తెలియచెప్పేందుకు ప్రభుత్వం ఈ యాత్రకు రూపకల్పన చేసింది. ఈ యాత్రలో ఉత్తరాఖండ్‌లోని రుషీకేశ్‌కు చెందిన లెఫ్ట్‌నెంట్ కమాండర్ వర్టిక జోషి, హిమాచల్‌ప్రదేశ్‌లోని కుల్లుకు చెందిన లెఫ్ట్‌నెంట్ కమాండర్ ప్రతిభ జమ్వల్, విశాఖపట్నానికి చెందిన లెఫ్ట్‌నెంట్ కమాండర్ పి స్వాతి, హైదరాబాద్‌కు చెందిన లెఫ్ట్‌నెంట్ ఐశ్వర్య బొడ్డపాటి, మణిపూర్‌కు చెందిన లెఫ్ట్‌నెంట్ ఎస్‌హెచ్ విజయదేవి, ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌కు చెందిన లెఫ్ట్‌నెంట్ పైల గుప్త పాల్గొంటున్నారు. వీరంతా వొయేజ్‌లో ప్రత్యేక శిక్షణ పొందారు. శిక్షణా సమయంలో ఐఎన్‌ఎస్‌వి మహదిలో సముద్రంలో సుమారు 20 వేల నాటికల్ మైళ్ళ దూరం ప్రయాణించారు. ఈ మహిళా నావికులు ప్రయాణించే తరణి నౌక ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత నౌకాదళంలో చేరింది. ఇప్పటివరకూ ఎనిమిది వేల నాటికల్ మైళ్ల దూరం ప్రయాణించింది. కెప్టెన్ దిలీప్ దోనే నేతృత్వంలో ఈ నౌక యాత్రకు బయల్దేరనుంది.
యాత్ర వివరాలు
ఈ యాత్ర సెప్టెంబర్ ఐదు నుంచి ప్రారంభం కానుంది. అక్టోబర్ 12 నాటికి ఆస్ట్రేలియాలోని ఫ్రమెంటల్ పోర్టుకు చేరుకుంటుంది. అక్టోబర్ 25న అక్కడి నుంచి బయల్దేరి నవంబర్ 16 నాటికి న్యూజిలాండ్‌లోని లైటెల్‌టోన్‌కు చేరుకుంటుంది. అక్కడి నుంచి నవంబర్ 23న బయల్దేరి డిసెంబర్ 28 నాటికి ఫాక్‌ల్యాండ్స్‌లోని పోర్టు స్టాన్లీకి చేరుకుంటుంది. జనవరి పదిన అక్కడి నుంచి బయల్దేరి ఫిబ్రవరి ఎనిమిదవ తేదీనాటికి సౌత్ ఆఫ్రికాలోని కేప్‌టౌన్‌కు చేరుకుంటుంది. ఫిబ్రవరి 21న అక్కడి నుంచి బయల్దేరి ఏప్రిల్ నాలుగున గోవాకు వస్తుంది.
లక్ష్యాలు
ఈ యాత్ర కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకుని ప్రారంభమవుతోంది. మహిళా శక్తి సామర్థ్యాలు ప్రపంచానికి తెలియచెప్పడం, మహిళల పట్ల ఉన్న న్యూనతా భావాన్ని పోగొట్టాలన్నది ఈ యాత్ర ముఖ్యోద్దేశం. అలాగే, ప్రపంచా వ్యాప్తంగా వాతావరణంలో వస్తున్న మార్పులను పరిశీలించడం, ఏయే ప్రాంతాల్లో వాతావరణ ముప్పు పొంచి ఉందన్న వివరాలను సంబంధిత అధికారులకు తెలియచడం ఈ యాత్ర ఉద్దేశం. మేక్ ఇన్ ఇండియాకు విస్తృత ప్రచారం ఇవ్వాలన్నది కూడా ఈ యాత్ర లక్ష్యం. ఆయా ప్రాంతాల్లో సముద్ర ఉపరితలంపై ఉన్న వాతావరణ పరిస్థితులు, వేవ్ డేటాను సేకరిస్తారు. ఆయా దేశాల్లోని స్థానికులతో మహిళా నావికులు సమావేశమై చర్చిస్తారు.

చిత్రం..ప్రపంచ యాత్రకు బయల్దేరనున్న మహిళా నావికులు