ఆంధ్రప్రదేశ్‌

మద్యం కంపెనీ అమ్మకం పేరుతో మోసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), ఆగస్టు 18: మద్యం తయారీ కంపెనీ అమ్మకం పేరుతో కోట్ల రూపాయల ఘరానా మోసం రాష్ట్ర రాజధాని నగరంలో వెలుగు చూసింది. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన ఓ ప్రముఖ మేకప్ ఆర్టిస్టు తాను మోసపోయానని, సుమారు ఐదు కోట్ల రూపాయలకు పైగా తనను ముంచేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిజిపి నండూరి సాంబశివరావుకు ఫిర్యాదు చేశారు. స్పందించిన డిజిపి ఈ వ్యవహారంపై సిఐడి విచారణకు ఆదేశించారు. ఒడిశా రాష్ట్రం రాయగడ జిల్లాలోని శ్రీశక్తి డిస్టలరీస్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ కంపెనీ అమ్మకం పేరుతో మోసగించినట్లు విశాఖకు చెందిన రాచకొండ ఉమామహేశ్వరరావు, విజయవాడ కానూరుకు చెందిన పంచుమర్తి అచ్యుతరామయ్య సహా పది మందిపై కోర్టు ఆదేశాలతో రాయగడ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే అక్కడ తమకు న్యాయం జరగడం లేదని భావించి ఏపి డిజిపి కి ఫిర్యాదు చేసిన బాధితుడు సినీ మేకప్ ఆర్టిస్ట్ ఇంటూరి సాంబయ్య విజయవాడలో శుక్రవారం విలేఖరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. చిత్రపరిశ్రమలో ఎన్‌టి రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, మోహన్‌బాబుతోపాటు పలువురు ప్రముఖ సినీ ఆర్టిస్టులకు మేకప్‌మెన్‌గా పని చేసి 56ఏళ్ళ సుదీర్ఘకాలం అనుభవం గడించిన సాంబయ్య, కొంతకాలం క్రితం స్నేహితులతో కలిసి ఫైర్ వాటర్ బేవరేజెస్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ ఏర్పాటు చేశారు. గోవాలోని లిక్కర్ తయారీ కంపెనీల నుంచి మద్యం కొనుగోలు చేసి, ఆంధ్రప్రదేశ్‌లో మార్కెటింగ్ చేసేవారు. ఈక్రమంలోనే ఒడిశా రాష్ట్రం రాయగడ జిల్లాలో శ్రీ శక్తి డిస్టలరీస్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ అమ్మకానికి ఉన్నట్లు తెలుసుకుని కంపెనీ బోర్డు డైరెక్టర్ల సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు 2015 జనవరిలో మెజారిటీ వాటాదారుడు, సంస్థ హక్కుదారుడైన రాచకొండ ఉమామహేశ్వరరావు నుంచి రూ.5.25 కోట్లకు కొనుగోలు ఒప్పందం చేసుకున్నారు. విక్రయదారుడైన ఉమామహేశ్వరరావు కోరిక మేరకు 20లక్షలు జీతాల చెల్లింపు కోసం నగదు రూపంలో ముట్టచెప్పారు. మిగిలిన మొత్తాన్ని బ్యాంకు ఖాతాల ద్వారా చెల్లించారు. 2015-16 ఆర్థిక సంవత్సరంలో సంస్థ చెల్లించాల్సిన లైసెన్స్, లేబుల్ రిజిస్ట్రేషన్ ఫీజు కింద సంవత్సరానికి 40లక్షలు చొప్పున ఫైర్ వాటర్ నిర్వహకులే చెల్లించారు. ఈక్రమంలో ఉద్యోగంకోసం వచ్చి, సంస్థలో డైరెక్టర్‌గా చేరిన పంచుమర్తి అచ్యుతరామయ్యతో కుమ్కక్కైన ఉమామహేశ్వరరావు కంపెనీ నిధుల దుర్వినియోగానికి పాల్పడటంతోపాటు, భార్య సోనికృష్ణను బోర్డు అనుమతి లేకుండా డైరెక్టర్‌గా చేర్చుకున్నట్లు ఫిర్యాది సాంబయ్య పేర్కొన్నారు. కంపెనీలో జరుగుతున్న మోసాన్ని గుర్తించేలోగా సకాలంలో రుణం చెల్లించలేదంటూ శ్రీశక్తి డిస్టలరీస్ కంపెనీ ఆస్తులను ఆంధ్రాబ్యాంకు ఎన్‌పిఏ జాబితాలో చేర్చింది. దీంతో ఫిర్యాది సాంబయ్య మరికొందరు ఉమామహేశ్వరరావును వెంటబెట్టుకుని, బరంపురంలోని రీజనల్ ఆఫీసును సంప్రదించి గడువు కోరినా ఇవ్వకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. అయితే ఉమామహేశ్వరరావు, అచ్యుతరామయ్యలు కలిసి సాంబయ్యకు తెలియకుండా బ్యాంకు బకాయిలు చెల్లించి మరో ఏడుగురు డైరెక్టర్లను కొత్తగా కంపెనీలో చేర్చుకుని మోసానికి తెర తీశారు. అయితే ఎంతకీ తమ షేర్లు బదలాయింపు జరగకపోవడంతో అసలు విషయం గ్రహించిన సాంబయ్య, జరిగిన మోసంపై రాయగడ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఆదేశాలు సైతం స్థానిక పోలీసులు పట్టించుకోనందున కోర్టును ఆశ్రయించారు. న్యాయమూర్తి ఆదేశాలతో ఒడిశాలోని చాందిలి పోలీస్టేషన్‌ళో క్రైం నెంబర్ 63/17 ఐపిసి 120బి, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రెండునెలల్లో నిందితులపై చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించినా పట్టించుకోనందున వారు పరారీలో ఉన్నారని, న్యాయం కోసం ఏపి డిజిపిని కలిసి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దీనిపై డిజిపి స్పందించి సిఐడి విచారణకు ఆదేశించారని, జరిగిన మోసాన్ని సిఎం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.