ఆంధ్రప్రదేశ్‌

ఓటుకు నోటు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల టౌన్, ఆగస్టు 18: నంద్యాల ఉప ఎన్నికలో డబ్బు పంపిణీకి తెర లేచింది. ఎన్నికలు మరో ఐదు రోజులు ఉండగానే ఓటర్లకు డబ్బు పంపిణీ ప్రారంభమైంది. పట్టణంలోని ఆయా ప్రాంతాల్లో ఓటర్లకు డబ్బు పంచుతున్న 47 మందిని పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.12 లక్షలకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని హరిజనపేట, నబీనగర్‌లో వైకాపా తరపున డబ్బులు పంచుతున్నట్లు అందిన సమాచారం మేరకు పోలీసులు అప్రమత్తమై కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.4 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా టూటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రెవెన్యూ క్వార్టర్స్‌లో డబ్బు పంచుతున్న ఏడుగురిని అరెస్టు చేసి వారి వద్ద రూ.1.88 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. మూడవ పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలోని దేవనగర్, తదితర ప్రాంతాల్లో 11 మందిని అరెస్టు చేసి వారి నుంచి రూ.6.40 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. వీరిలో ఆరుగురు వైకాపా తరపున, మరో ఐదుగురు టిడిపి తరపున డబ్బులు పంచుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. నంద్యాల, అనంతపురం, పులివెందుల, కడప, బేతంచెర్ల, పేరుసోముల తదితర ప్రాంతాల నుంచి వచ్చిన కొంతమంది నంద్యాలలో ఓటర్లకు నగదు పంచుతుండగా పట్టుకున్నట్లు వన్‌టౌన్ సిఐ అస్రార్ బాషా తెలిపారు. వీరిపై ఎన్నికల నియామవళి ప్రకారం కేసు నమోదు చేసినట్లు చెప్పారు. స్వాధీనం చేసుకున్న నగదు కోర్టుకు సమర్పించినట్లు తెలిపారు.