ఆంధ్రప్రదేశ్‌

కలకలం రేపిన సిఎం ప్యాంట్రీ వ్యాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, ఆగస్టు 18: కర్నూలు జిల్లా నంద్యాలలో ఓ వ్యాన్ శుక్రవారం రాత్రి కలకలం రేపింది. తెలుగుదేశం పార్టీ నాయకులు నంద్యాల ఉప ఎన్నికల ఖర్చుల కోసం పెద్దమొత్తం నోట్లు తరలిస్తున్నారంటూ ఎన్నికల అధికారులకు సమాచారం అందడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విజయవాడ నుంచి భారీ ఎత్తున నగదుతో కూడిన కంటైనర్ నంద్యాలకు వస్తోందన్న సమాచారం మేరకు మహానంది మండలం గాజులపల్లె గ్రామం వద్ద ఎన్నికల అధికారులు వాహనాన్ని అడ్డుకున్నారు. ఆర్టీసి సంస్థ పేరుపై రిజిష్టర్ అయి ఉన్న వాహన డ్రైవరను అధికారులు విచారించగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు వంట చేసి పెట్టేందుకు వస్తున్నామని అందులో ఏం ఉందో తనకు తెలియదని సమాధానం ఇచ్చారు. ఇదే సమయంలో వైకాపా నేతలు గాజులపల్లె వద్దకు చేరుకొని వాహనంలో ఏముందో ఇక్కడే తేల్చాలని పట్టుబట్టారు. అయితే ఎన్నికల కమిషన్‌కు సమాచారం ఇచ్చామని వారు వాహనాన్ని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి తరలించాలని ఆదేశించారని ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. పోలీసుల సహకారంతో వాహనాన్ని నంద్యాల ఆర్డీవో కార్యాలయానికి తీసుకువచ్చారు. తాళం కోసం డ్రైవరును అడుగగా భద్రతాధికారుల వద్ద ఉంటుందని చెప్పాడు. అయితే వైకాపా నేతలు మాత్రం తక్షణం తనిఖీ చేయాలని పట్టుబడడంతో ఎన్నికల కమిషన్ అనుమతితో నోడల్ అధికారి తిప్పేనాయక్ సమక్షంలో పోలీసులు తాళం పగులగొట్టి చూడగా అందులో కొన్ని వంట పాత్రలు మాత్రమే కనిపించాయి. దీంతో ఉత్కంఠకు తెరపడింది. కాగా కంటైనర్ ముందు వచ్చిన కర్నాటక బస్సు, వెనుక ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్ వాహనాన్ని ఎందుకు తనిఖీ చేయలేదని వైకాపా నేతలు ప్రశ్నించారు. స్థానిక అధికారుల తీరుపై తాము ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని వారు అన్నారు. కాగా ముఖ్యమంత్రి వంట వాహనాన్ని (ప్యాంట్రీ కారు) ఎన్నికల అధికారులు తనిఖీ చేశారని తెలుసుకున్న టిడిపి నేతలు, మంత్రులు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకోవడంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు ఇరువర్గాలను అక్కడినుంచి పంపించి వేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.