ఆంధ్రప్రదేశ్‌

2019 మార్చి నాటికి ఎల్‌ఇడి వీధి దీపాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 18: 2019 మార్చి నాటికి ఎపి అంతటా ఇంధన సామర్థ్యం కలిగి ఉండే ఎల్‌ఇడి వీధి దీపాలను ఏర్పాటు చేస్తామని ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్ అన్నారు. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషీయన్సీ, ఏపీ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం విశాఖలో నిర్వహించిన జాతీయ సదస్సులో ఆయన ముఖ్య ప్రసంగం చేశారు. ఏపీలో 13వేల గ్రామాల్లో 40 లక్షల ఎల్‌ఇడి వీధి దీపాలు అమర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. దీనివల్ల ఇంధన పొదుపు ప్రతి ఏడాది 444 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అవుతుందన్నారు.
ఏపీలో లక్ష వ్యవసాయ పంపుసెట్లను ఉచితంగా రైతులకు అందిస్తున్నట్టు చెప్పారు. అలాగే ఇంధన సామర్థ్యం కలిగి ఉండే పంపుసెట్ల ద్వారా 30 శాతం ఇంధన ఆదా అవుతుందన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలంలో పైలెట్ ప్రాజెక్టుగా ఈ పథకాన్ని ప్రారంభించామన్నారు. ఇదే జిల్లాలో 2,496 సాధారణ పంపుసెట్లను ఇంధన సామర్థ్యం కలిగి ఉండే పంపుసెట్లగా మారుస్తామన్నారు.

చిత్రం..ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్