ఆంధ్రప్రదేశ్‌

ఉద్యమ పంథా మార్చిన ముద్రగడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రత్తిపాడు, ఆగస్టు 18: కిర్లంపూడి నుండి అమరావతి వరకు నిరవధిక పాదయాత్ర తలపెట్టిన కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంను పోలీసులు శుక్రవారం కూడా అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ముద్రగడ తన ఉద్యమ పంథాను మార్చి పోలీసులు అడ్డుకున్న చోటే కుర్చీ వేసుకుని బైఠాయించారు. వెంట ఉన్న జెఎసి, కాపు సంఘాల నాయకులతో అక్కడే బైఠాయించారు. ఈ సందర్భంగా ముద్రగడ మాట్లాడుతూ తనను గత 23 రోజులుగా పోలీసులు అడ్డుకుంటున్నారని, ఇక తనకు సహనం లేదన్నారు. అడ్డుకుంటున్న పోలీసుల ద్వారా ప్రభుత్వానికి ఎన్నో రకాలుగా విజ్ఞప్తులుచేసినా వారి నుండి ఎలాంటి సమాధానం రాకపోవడంతో తాను శుక్రవారం నుండి ప్రతి రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు రోడ్డుపైనే బైఠాయిస్తానన్నారు. ఏ క్షణంలోనైనా తాను పోలీసుల హద్దులు దాటి పాదయాత్ర చేస్తానని స్పష్టంచేశారు. కాగా ముద్రగడ గేటు వద్దే బైఠాయించారన్న విషయం చాలామందికి తెలియడంతో జిల్లా నలుమూలల నుండి కాపు సంఘాల నేతలు భారీ సంఖ్యలో ముద్రగడ శిబిరానికి చేరుకుని ఆయనకు మద్దతు తెలిపారు. తుని నియోజకవర్గం నుండి కాపు నాయకుడు నరిశే శివాజీ సారథ్యంలో సుమారు రెండు వేల మంది కాపు యువకులు శుక్రవారం ముద్రగడ శిబిరానికి వచ్చి ఆయనకు మద్దతు పలికారు. వారిలో చాలా మందిని పోలీసులు అడ్డుకుని అడ్రసులు, ఆధార్ నెంబర్లు తదితర వివరాలు సేకరించేందుకు ఉపక్రమించడంతో వాగ్వాదం జరిగింది.

చిత్రం..జెఎసి నేతలతో కలిసి తన ఇంటి ముందే బైఠాయించిన ముద్రగడ