ఆంధ్రప్రదేశ్‌

ఇంధన సామర్థ్యం బలపడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 18: ఇంధన సామర్థ్యం, విద్యుత్ వ్యవస్థ అన్నివిధాలా అభివృద్ధి చెందాలని ఎపి విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ జస్టిస్ భవానీప్రసాద్ అన్నారు. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ, ఎపి స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం విశాఖలో నిర్వహించిన జాతీయ సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంధన సామర్థ్యాన్ని పెంపొందించాల్సి ఉందని, అయితే అదే క్రమంలో విద్యుత్ వ్యవస్థను అన్నివిధాలా బలోపేతం చేయాలన్నారు. వౌలిక వసతుల కల్పన, మానవ వనరులు పెంచడం, మెరుగైన విద్యుత్ సరఫరా, ట్రాన్సిమిషన్ నష్టాల తగ్గింపు వంటి వాటిపై దృష్టి సారించాలన్నారు. గ్రామాల్లో లైన్‌మెన్ల కొరత ఉందన్నారు. విద్యుత్ సంబంధిత సమస్యల పరిష్కారానికి లైన్‌మెన్ల వ్యవస్థను పటిష్టపర్చాల్సి ఉందన్నారు. గ్రామాల్లో వేలాడే విద్యుత్ తీగలతో ప్రమాదాలు జరుగుతున్నందున లైన్ల నిర్వహణ సరిగా ఉండాలన్నారు. ఇందుకోసం గ్రామాల్లో లైన్‌మెన్ల వ్యవస్థను పటిష్టపర్చాల్సి ఉందన్నారు. అలాగే తీర ప్రాంతాల్లో ప్రతి ఏడాది తుపాన్లు సంభవించడంతో కోట్లాది రూపాయల వరకు ఖర్చు చేయాల్సి వస్తోందన్నారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు 80 శాతం, మిగిలిన ఖర్చులన్నీంటినీ 20 శాతం మేర అయినట్టుగా డిస్కంలు చూపుతున్నాయని, మనం 1950లో లేమని, ప్రజలు ప్రశ్నిస్తే దీనికి ఏం సమాధానం చెబుతామని ఆయన పేర్కొన్నారు. ఎపి స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ సిఇఒ ఏ.చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ ఇంధన సామర్థ్యం కలిగి ఉండే ఎల్‌ఇడి బల్బుల వాడకంపై దేశంలో ఇతర రాష్ట్రాలు దృష్టి సారిస్తున్నాయన్నారు. రాజస్థాన్, గుజరాత్‌ల్లో వీటిని ఉపయోగించుకునే క్రమంలో చర్యలు తీసుకుంటున్నారన్నారు. విశాఖ నగరంలో ఇటీవల జరిగిన బ్రిక్స్ సదస్సులో సైతం ఇంధన సామర్థ్యం కలిగిన బల్బుల గురించి చర్చించడం హర్షణీయమన్నారు. ఏపీఈపీడిసిఎల్ చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎమ్‌ఎమ్ నాయక్ మాట్లాడుతూ 2014 అక్టోబర్ 12న విశాఖలో సంభవించిన హుదూద్ తుపానుతో విద్యుత్ వ్యవస్థ విచ్ఛిన్నం అయ్యిందని, దీని తరువాత ఇంధన సామర్థ్యం కలిగి ఉండే ఎల్‌ఇడి బల్బులు 90వేల వరకు నగరంలో ఏర్పాటు చేయగలిగామన్నారు. అలాగే 40 లక్షల గృహ వినియోగదారులకు సంబంధించి 80 లక్షల ఎల్‌ఇడి బల్బుల పంపిణీ చేశామన్నారు. ఇదే తరహాలో ఫైవ్ స్టార్ రేటెడ్ ఫ్యాన్లు వినియోగదారులకు అందించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫైలెట్ ప్రాజెక్టు కింద ప్రారంభించారన్నారు. దీనివల్ల 30 శాతం మేర విద్యుత్ ఆదా అవుతుందన్నారు. ట్యూబ్ లైట్లు, బల్బులు, ఫ్యాన్ల వాడకంపై అవగాహన పెంచాల్సి ఉందన్నారు.

చిత్రం..జస్టిస్ భవానీ ప్రసాద్