ఆంధ్రప్రదేశ్‌

స్మార్ట్ వాటర్ గ్రిడ్‌కు త్వరలో సాకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 16: రాష్ట్రంలోని ప్రాజెక్ట్‌లన్నింటినీ త్వరితగతిన పూర్తిచేసి స్మార్ట్ వాటర్ గ్రిడ్ లక్ష్యాన్ని సాకారం చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. నీటిపారుదల శాఖ అధికారులతో సోమవారం ఆయన ఇక్కడ సమీక్ష సమావేశం నిర్వహించారు. 2018 నాటికి పోలవరం ప్రాజెక్ట్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ పూర్తిచేయాలని, అంతకుముందు పునరావాస కార్యక్రమాన్ని చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇకపై ప్రతినెలా పోలవరం ప్రాజెక్ట్ పనులను సమీక్షించి ఎప్పటికప్పుడు లక్ష్యాలను నిర్దేశిస్తానని చంద్రబాబు చెప్పారు. తోటపల్లి ప్రాజెక్ట్‌లో మిగిలిన పనులను త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్ట్‌లు సకాలంలో పూర్తికావాలంటే నిర్ణీత సమయంలో భూసేకరణ పనులు పూర్తిచేయాలని చెప్పారు. పోలవరం కుడి కాలువ, తమ్మిలేరు పనుల పురోగతిని ముఖ్యమంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ పనుల్లో జాప్యానికి కారణాలపై అధికారుల్ని ప్రశ్నించారు. ఇక్కడ పనిచేసే కార్మికులు ఎన్నికల్లో పాల్గొనేందుకు తమ రాష్ట్రాలకు వెళ్లారని అధికారులు తెలిపారు. ఏలేరు ద్వారా విశాఖకు నీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.
నీరు-ప్రగతిలో మనం దేశానికే ఆదర్శం
రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న జల సంరక్షణ చర్యలు సత్ఫలితాలిస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. అధికారులు, ప్రజాప్రతినిధులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉపాధి హామీ పథకం కింద ఈ ఏడాది 5,400 కోట్లు ఖర్చుచేయాల్సి ఉండగా, ఇప్పటివరకూ 1000 కోట్లు ఖర్చయ్యాయని తెలిపారు. రానున్న 45 రోజుల్లో మరో వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చుచేసేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. నీరు-ప్రగతి కార్యక్రమంలో మన రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఆయన తెలిపారు. కృష్ణా, కర్నూలు, తూర్పు గోదావరి జిల్లాల్లో ఉపాధి హామీ పనుల్లో పురోగతి బాగుందన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పనుల వేగాన్ని పెంచాలని సూచించారు. పంట సంజీవనిలో అనంతపురం, ప్రకాశం, చిత్తూరు జిల్లాలు ముందంజలో ఉన్నాయని, శ్రీకాకుళం, కృష్ణా, విశాఖ, నెల్లూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో ఈ కార్యక్రమం మెరుగుపడాల్సిన అవసరముందని ఆయన చెప్పారు.