తెలంగాణ

1న పెన్షన్ విద్రోహ దినం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 19: కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినం పాటించాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ నాయకులు పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 1న ఉపాధ్యాయులు అంతా నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపాలని అన్నారు. జిల్లా కేంద్రాల్లో సామూహిక ధర్నాల్లో పాల్గొనాలని అన్నారు. శనివారం నాడు యుటిఎఫ్ కార్యాలయంలో వారు ఒక గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పెన్షన్ భిక్ష కాదని, ఉద్యోగుల హక్కు అని అన్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా, కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు పెన్షన్‌ను రద్దు చేశాయని అన్నారు. రాష్ట్రంలోని లక్ష 20 వేల మంది ఉపాధ్యాయులు , ఉద్యోగుల కుటుంబాల సామాజిక భత్రను అగమ్య గోచరంగా మార్చిన సిపిఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని, అయినా నిర్ణయం తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వారు ఆరోపించారు.