ఆంధ్రప్రదేశ్‌

కరవు, వరదల్లేని దేశమే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 20: కరవు, వరదలు లేని భారతదేశం కోసం సత్వరం చేపట్టాల్సిన చర్యలపై ఈ నెల 16, 17, 18 తేదీల్లో కర్నాటకలోని బీజాపూర్‌లో నదుల పరిరక్షణపై జరిగిన జాతీయ సదస్సులో ‘విజయపుర డిక్లరేషన్’ పేరిట చారిత్రక నిర్ణయాలు తీసుకున్నట్లు నదుల పరిరక్షణ ఉద్యమవేత్త బొలిశెట్టి సత్యనారాయణ తెలిపారు. ఆదివారం నాడిక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 29 రాష్ట్రాలు, ఏడు కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి వచ్చిన వేలాది మంది జల సంరక్షకులు, జల విజ్ఞానవేత్తలు, భూగర్భ నిపుణులు, సంఘ సంస్కర్తలు, శాస్తవ్రేత్తలు, ఆర్థిక నిపుణులు, రాజకీయ ప్రముఖులు, నదీ సంరక్షణ యాత్రికులు చర్చించి రూపొందించిన చరిత్రాత్మక ‘విజయపుర డిక్లరేషన్’ను చివరిరోజు కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రకటించారని చెప్పారు. ఇందులో ప్రధానంగా నది, దాని పరీవాహక ప్రాంతం, దాని ఉప నదులు మొత్తాన్ని కలిపి నీటిని పంచుకునే అంశంగా కాకుండా ఒక సహజ జీవవనరుగా పరిగణిస్తూ పరిరక్షించుకోవాల్సి ఉందనే విషయాన్ని ప్రస్తావించామన్నారు. జాతీయ స్థాయిలో నీటి పరిజ్ఞాన మిషన్‌ను నెలకొల్పి తద్వారా విద్యార్థులు, రైతులు, నీటి వినియోగదారులను చైతన్యపరచాల్సి ఉందన్నారు. ముఖ్యంగా నదులను కాలుష్యం బారి నుంచి కాపాడటం ద్వారా నీటి పరిశుభ్రత కోసం పాటుపడాలని, ఆక్రమణలను తొలగించి నదుల్లో నీటి ప్రవాహం సక్రమంగా జరిగేలా చూడాలని, ప్రజల భాగస్వామ్యంతో ప్రజా నదీచట్టం ద్వారా నీటి హక్కుల రూపకల్పనతో నీటిని సద్వినియోగం చేసుకోవాలని, నదీ పరీవాహక ప్రాంతాల్లోని పల్లెలు, గ్రామాలు, పట్టణాల్లో ‘నదీ పార్లమెంట్’ను ఏర్పాటు చేసుకుని జల స్వాతంత్య్రాన్ని సాధించాలని నిర్ణయించినట్లు బొలిశెట్టి వివరించారు. రాజధాని అమరావతి ప్రాంత రైతు కూలీ పరిరక్షణ సంస్థ చైర్మన్ అనుమోలు గాంధీ మాట్లాడుతూ మెగసేసే అవార్డు గ్రహీత డాక్టర్ రాజేంద్ర సింగ్ నేతృత్వంలో ఈ నెల 2న కృష్ణా జిల్లా దివిసీమ హంసలదీవి నుంచి ప్రారంభమైన ‘నదీ పరిరక్షణ యాత్ర’ విజయవంతంగా కర్నాటకకు చేరిందని, ఆపై మూడురోజుల సదస్సు జరిగిందని తెలిపారు. కృష్ణా నది ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే ఆక్రమణలు, మురుగు నీటితో కలుషితం కావటం పట్ల సదస్సుకు హాజరైన ప్రతినిధులంతా ఆందోళన వ్యక్తం చేశారని ఆయన వివరించారు.

చిత్రం..విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న బొలిశెట్టి సత్యనారాయణ