ఆంధ్రప్రదేశ్‌

నంద్యాల ఎన్నికపై బెజవాడలో బెట్టింగులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 20: దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నంద్యాల ఉప ఎన్నిక పోలింగ్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభం కావటంతో రాజకీయ రాజధాని విజయవాడ నగరంలో బెట్టింగులు జోరందుకున్నాయి. తెలుగుదేశం పార్టీకి చెందిన శిల్పా మోహన్‌రెడ్డి ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి ఆఖరి క్షణంలో వైకాపాలో చేరి అభ్యర్థిగా బరిలో నిలవటం, తర్వాత ఆయన సోదరుడు, ఎమ్మెల్సీ చక్రపాణిరెడ్డి కూడా అదే బాటలో నడవటం వైకాపా శ్రేణుల్లో జోష్ నింపింది. వైకాపా అధినేత జగన్ నైతిక విలువలకు కట్టుబడి ఎమ్మెల్సీ పదవికి చక్రపాణిరెడ్డితో రాజీనామా చేయించటాన్ని కూడా వైకాపా శ్రేణులు అనుకూలంగా మలుచుకున్నాయి. ఇక జగన్ కాలికి బలపం కట్టుకుని ఊరూవాడా తిరుగుతుండటంతో లభిస్తున్న ప్రజాస్పందనను చూసి వైకాపా అభ్యర్థి గెలిచి తీరుతాడంటూ ఇక్కడ లక్షల రూపాయల్లో బెట్టింగ్‌లు కాశారు. ఇక రాజకీయాల్లో ఎత్తుకు పైఎత్తులతో తనకు తానే సాటిగా నిలిచే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండ్రోజులు నంద్యాలలోనే మకాం చేసి రోడ్ షోలతో పాటు నాలుగు గోడల మధ్య చేసిన వ్యూహరచనతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి అనుకూలంగానూ బెట్టింగ్‌లు జోరందుకున్నాయి. వైకాపా నాయకుల వద్ద లక్షల్లో నగదు పట్టుబడటం, అడుగడుగునా సాయుధ పోలీస్ పహరా, మంత్రులు, టిడిపి ప్రజాప్రతినిధుల డేగకన్ను.. వంటి పరిణామాలతో నోట్ల పంపిణీ వైకాపాకు కష్టతరంగా మారిందని అంటున్నారు. ఈ పరిణామం బెట్టింగులపైనా ప్రభావం చూపిందని తెలుస్తోంది.