ఆంధ్రప్రదేశ్‌

వారాంతంలో ‘ఆనంద లహరి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 22: రాష్ట్రంలోని 110 పురపాలక పట్టణాలు, నగరాల్లో ‘ఆనంద లహరి’ పేరుతో వారాంతపు వినోద కార్యక్రమాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రొఫెషనల్ ఆర్టిస్టులు, విద్యార్థులు, ఔత్సాహిక కళాకారులతో వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన, పోటీల నిర్వహణతో పాటు అక్కడే హస్తకళల ప్రదర్శనలు, ఫుడ్ స్టాల్స్ ఏర్పాటుచేస్తారు. ప్రతి వారాంతంలో 4గంటలపాటు ఈ కార్యక్రమాలు ఉంటాయి. మద్యం, మత్తు పదార్ధాలు ఆరోగ్యానికి ఎంత హానికరమో తెలియజేసి వాటి బారిన పడకుండా ప్రజలను చైతన్యవంతుల్ని చేయడం వంటి ధీమ్‌లతో వారాంతపు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రతి వారాంతంలో ‘ఆనంద లహరి’ కార్యక్రమాలు నిర్వహించాలన్న సాంస్కృతికశాఖ ప్రతిపాదనను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదించారు. సాంస్కృతికశాఖ అధికారులతో మంగళవారం సాయంత్రం ఉండవల్లిలోని నివాసంలో ఆయన వివిధ అంశాలపై చర్చించారు. బడికి వెళ్లి చదువుకోవడం, స్ర్తిశక్తి, బలవంతపు వివాహాలను అరికట్టడం, ఆడబిడ్డల సంరక్షణ, వరకట్న నియంత్రణ, ఆడపిల్లలకు విద్య నేర్పించాల్సిన ఆవశ్యకత, కులాలకు అతీతంగా జీవించడం వంటి సామాజిక అంశాలతో కళా, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. థియేటర్, డ్రామా, స్టేజ్ ప్రదర్శనలు, కవి సమ్మేళనాలు, రచయితలతో సదస్సులు, కవితా గోష్ఠులు, సంగీత కార్యక్రమాలు ఉంటాయి. విజువల్ ఆర్ట్స్, పెయింటింగ్, చిత్రలేఖనం, శిల్ప నిర్మాణం, సంగీతం, వక్తృత్వం, డిబేట్ వంటి పోటీలు నిర్వహిస్తారు. స్థానిక పాలనా సంస్థల సహకారంతో విద్యార్థులు, ఔత్సాహిక కళాకారులకు తగిన తర్ఫీదునిచ్చి వారితో ప్రదర్శనలు ఏర్పాటుచేస్తారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ప్రాచుర్యం పొందిన స్థానిక రుచులు, తినుబండారాలతో ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతికశాఖ ఈ మొత్తం కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తుంది. జిల్లా కలెక్టర్లకు మార్గదర్శకాలు అందిస్తుంది. దిగువ స్థాయిలో కార్యక్రమాల నిర్వహణను నోడల్ అధికారి స్థానిక సంస్థల పాలనాధికారితో కలిసి పర్యవేక్షిస్తారు. ఆదాయ వ్యయాల బాధ్యతలను స్థానిక పాలనా సంస్థలకే అప్పగించారు. ప్రజల్లో ఉన్న సృజనను వెలికితీసేలా ‘ఆనంద లహరి’ కార్యక్రమాలు ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. సామాజిక రుగ్మతలను రూపుమాపడానికి ఇవి దోహదపడతాయని అభిప్రాయపడ్డారు. తరచూ ఫుడ్ ఫెస్టివల్స్ నిర్వహించి ప్రజలకు వివిధ ప్రాంతాల్లో గల రుచులను అందుబాటులో ఉంచాలన్నారు. 30 రకాల సంప్రదాయ ఆంధ్ర రుచులను తొలుత ఫుడ్ ఫెస్టివల్స్‌లో ఉంచుతామని అధికారులు ముఖ్యమంత్రికి చెప్పారు. వచ్చే నెలలో వెలగపూడి సచివాలయంలో భారీఎత్తున ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్టు ముఖ్యమంత్రికి అధికారులు తెలియజేశారు. విజయవాడ సత్యనారాయణపురంలో ‘కళాభవన్’ నెలకొల్పాలన్న సాంస్కృతికశాఖ ప్రతిపాదనకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆమోదం తెలిపారు. కళాభవన్ పేరిట ఏర్పాటుచేసే సాంస్కృతిక భవనానికి ఇప్పటికే స్థలాన్ని గుర్తించారు. ఈ ప్రాజెక్టు విలువ రూ.10 కోట్లు అని అంచనా వేశారు.