ఆంధ్రప్రదేశ్‌

వెంకయ్య స్వాగతానికి రేషన్ డీలర్లకు టార్గెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 26: భారత ఉప రాష్టప్రతి హోదాలో తొలిసారిగా రాష్ట్రానికి విచ్చేస్తున్న వెంకయ్యనాయుడికి తలపెట్టిన పౌర సన్మానానికి ముందు జరిగిన రోడ్‌షో విజయవంతానికి రాష్ట్ర ప్రభుత్వం శాఖలవారీగా జన సమీకరణకు అధికారికంగానే ఇండెంట్లు పెట్టింది. ముఖ్యంగా విద్యాశాఖాధికారులు వినాయకచవితి నుంచే పాఠశాలలకు, ఇతర విద్యాసంస్థలకు ఫోన్ చేసి విద్యార్థులను రప్పిస్తే, పౌర సరఫరాల శాఖాధికారులు రేషన్ డీలర్లకు ఇండెంట్ పెట్టారు. ప్రతి డీలర్ కూడా తన పరిధిలో కనీసం పది మంది తెల్లకార్డుదారులను వెంట పెట్టుకుని సబ్ కలెక్టరేట్ వద్దకు ఉదయం ఏడు గంటలకే హాజరు కావాలంటూ సహాయ అధికారి ఉదయభాస్కర్ నగరంలోని డీలర్లందరికీ వాయిస్ మెసేజ్‌లు పంపించారు. ఏ డీలర్ ఎంత మందిని తీసుకువచ్చింది హాజరు వేసుకుంటామని కూడా ఆ మెసేజ్‌లో సున్నితంగా హెచ్చరించారు. ఇలా జరగటం ఇదే ప్రథమంగా డీలర్లు చెబుతున్నారు.