ఆంధ్రప్రదేశ్‌

ప్రభుత్వ రంగ సంస్థల నిర్వీర్యానికి కుట్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 26: దేశంలో లక్షలాది మంది కార్మికులు, ఉద్యోగులకు ఉపాధి కల్పిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను దశల వారీగా మూసివేయడం లేదా ప్రైవేటుపరం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కుట్ర పన్నుతున్నారని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బివి రాఘవులు మండిపడ్డారు. ‘సేవ్ పబ్లిక్ సెక్టార్’ పేరిట విశాఖలో శనివారం నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కొలంబియా యూనివర్శిటీకి చెందిన అరవింద్ పనగారియా(నీతి అయోగ్ వైస్ చైర్మన్) ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు ‘బ్లూప్రింట్’ సిద్ధం చేశారని ఆరోపించారు. పైకి దేశభక్తునిగా ప్రచారం చేసుకుంటున్న ప్రధాని మోదీ ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసేందుకు సిద్ధపడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు సంబంధించి ఇటీవల సిఇఓలతో నిర్వహించిన సమావేశంలో ప్రధాని మోదీ ఆమోదించారని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలను దశల వారీగా మూసివేయడం, కొన్నింటిని ప్రైవేటీకరించడం వంటి అంశాల్లో వ్యూహాత్మక పత్రాల ద్వారా ముందుకు వెళ్లేందుకు ప్రధాని అంగీకారం తెలిపారన్నారు. దేశంలో 235 ప్రభుత్వ రంగ సంస్థల్లో ఆరు సంస్థలను తక్షణమే మూసేయాలని, మరో 74 సంస్థలను దశల వారీగా మూయించాలని, మరో 20 సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాలన్నది మోదీ ఆమోదించిన వ్యూహాపత్రంలో ప్రధాన అంశాలని మండిపడ్డారు. దశల వారీగా మూసేసే సంస్థల్లో రక్షణ రంగానికి చెందిన 9 పరిశ్రమలున్నాయన్నారు. విశాఖ నగరాన్ని తీసుకుంటే మిలటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్(ఎంఇఎస్), నేవల్ ఆర్మ్‌డ్ డిపో(ఎఎడి), నేవల్ డాక్‌యార్డ్, డిఆర్‌డిఓ వంటి రక్షణ సంస్థలతో పాటు భెల్, హెచ్‌పిసిఎల్ వంటి సంస్థలను కూడా మోదీ ప్రభుత్వం విడిచిపెట్టట్లేదని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులను విక్రయించడం, మూసేయడం వల్ల ప్రజలకు ఒరగేదేమీ ఉండదని, దేశ సంపద కొల్లగొట్టేందుకే వీటిని ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. ఇక దేశ వ్యాప్తంగా లక్షల కోట్ల ఆస్తులు కలిగిన రైల్వే ఆస్తులను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం యత్నిస్తోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఇటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ప్రజా పోరాటాల ద్వారానే ప్రభుత్వ రంగ సంస్థలను రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. అంతకు ముందు సిపిఎం ఆధ్వర్యంలో వేలాది మంది కార్మికులు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

చిత్రం..సేవ్ పబ్లిక్ సెక్టార్ సభలో ప్రసంగిస్తున్న సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బివి.రాఘవులు