ఆంధ్రప్రదేశ్‌

నంద్యాల ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఇలా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, ఆగస్టు 26: నంద్యాల శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నికకు ఓట్ల లెక్కింపునకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సత్యనారాయణ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నంద్యాల పాలిటెక్నిక్ కళాశాలలో అత్యంత భద్రతాచర్యల మధ్య సోమవారం ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభించనున్నారు. మొదట పోస్టల్ బ్యాలెట్ పత్రాలను లెక్కించి ఆ తరువాత ఈవిఎంలలో నిక్షిప్తమైన ఓట్లను లెక్కిస్తారు. ఓట్ల లెక్కింపు 19 రౌండ్లలో పూర్తి చేయడానికి తగిన ఏర్పాట్లు చేశారు. ఇందుకు సంబంధించిన ఓట్ల లెక్కింపునకు ఎంపికైన అధికారులు, సిబ్బందికి అవసరమైన శిక్షణ ఇచ్చారు. నంద్యాల నియోజకవర్గంలో మొత్తం 2,18,858 ఓట్లు ఉండగా ఈనెల 23వ తేదీ 1,73,335 ఓట్లు పోలయ్యాయి. నంద్యాలలో పట్టణంలో 1,05,629 ఓట్లు, నంద్యాల గ్రామీణ ప్రాంతాల్లో 41,514, గోస్పాడు మండలంలో 26,192 ఓట్లు పోలయ్యాయి. నియోజకవర్గంలో మొత్తం పురుష ఓటర్లు 1,07,778 మంది ఉండగా 84,831 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం మహిళా ఓటర్లు 1,11,018 మంది ఉండగా వీరిలో 88,503 మంది ఓటేశారు. ఇతరులు 65 మంది ఉండగా వారిలో ఒక్కరు మాత్రమే పోలింగ్‌లో పాల్గొన్నారు. ఓటర్ల తీర్పు ఉదయం 11 గంటల సమయానికి వెల్లడించే అవకాశముంది. కాగా నంద్యాల ఎన్నికల్లో కొత్తగా వినియోగించిన వివిప్యాడ్ యంత్రంలో నమోదైన ఓట్లను అవసరమైతే పరిశీలిస్తామని వారు అన్నారు. పోలైన ఓట్లలో ఏమైనా తేడాలుంటే వివిప్యాడ్ నమోదు చేసిన ఓట్లను లెక్కించి వాస్తవ లెక్కలను గుర్తిస్తామన్నారు. ఆయా బూత్‌లలో ఈవిఎంలలో నమోదైన ఓట్లు, అధికారుల వద్ద ఉన్న లెక్కలను సరిపోవాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. అయితే వివిప్యాడ్ యంత్రం నమోదు చేసిన ఓట్ల వివరాలు తెలుసుకోవడం అన్నది రాజకీయ పార్టీల లెక్కింపు ఏజంట్లు తెలిపే అభ్యంతరాలపై రిటర్నింగ్ అధికారి నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. పోలింగ్ అనంతరం పట్టణంలో తలెత్తిన ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా నంద్యాలలో ఆదివారం మధ్యాహ్నం నుంచి 144వ సెక్షన్ ఆంక్షలు అమలు చేయనున్నారు. పట్టణంలోని సున్నిత ప్రదేశాల్లో భారీ సంఖ్యలో పోలీసు భద్రత పెంచారు. ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొనడానికైనా సిద్ధంగా ఉన్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, హింసకు తావు లేకుండా ఎన్నికల ప్రక్రియ ముగిస్తామని అంటున్నారు.