ఆంధ్రప్రదేశ్‌

భారీగా ఎర్రచందనం పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఆగస్టు 26 : చెన్నైలో టాస్క్ఫోర్స్ పోలీసులు ఈ నెల 24, 25 తేదీల్లో నిర్వహించిన దాడుల్లో మలేషియాకు తరలించేందుకు సిద్ధంగా ఉంచిన రూ.16 కోట్లు విలువచేసే 40 మెట్రిక్ టన్నుల ఎర్రచందనాన్ని పట్టుకున్నారు. ఇంతేకాకుండా చెన్నై పోర్టు నుంచి మలేషియాకు ఎవరికి చేరుతున్నాయన్న దానిపై కూడా ఆరా తీస్తున్నారు. గత రెండు రోజులుగా పట్టుబడ్డ 20 అడుగుల పొడవున్న ఎర్రచందనం దుంగలను కంటైనర్ ద్వారా ఓడల్లో ఎక్కించడానికి సిద్ధం చేసిన క్రమంలో డిఆర్‌ఐ (డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్ చెన్నై జోనల్ యూనిట్) అధికారులు పక్కా వ్యూహంతో పట్టుకున్నారు. బట్టల కంటైనర్లుగా పోర్టులో నమోదు చేసుకుని అనుమతి పొందిన తరువాత ఎర్రచందనాన్ని చెన్నై పోర్టు ద్వారా మలేషియాకు తరలించేందుకు స్మగ్లర్లు వ్యూహరచన చేశారు. అనుకున్న ప్రకారమే కంటైనర్ ప్రైట్ స్టేషన్స్‌లో అనుమతి కూడా పొందారు. అయితే ఇందులో ఎర్రచందనం అక్రమంగా రవాణా అవుతోందని పక్కా సమాచారం అందుకున్న డిఆర్‌ఐ అధికారులు 24వ తేదీన రూ.2 కోట్లు విలువచేసే ఐదు మెట్రిక్ టన్నుల ఎర్రచందనాన్ని సీజ్ చేశారు. అలాగే 25వ తేదీన రూ.11 కోట్లు విలువచేసే 27 మెట్రిక్ టన్నులున్న మరో మూడు కంటైనర్లను పట్టుకున్నారు. అలాగే రూ.3.4 కోట్లు విలువచేసే 9 మెట్రిక్ టన్నులున్న మరో కంటైనర్‌ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కడప, చిత్తూరు జిల్లాల్లో ఉన్న శేషాచలం అటవీ ప్రాంతా ల నుంచి ఈ ఎర్రచందనం దుంగలు స్మగ్లర్లు కొట్టి తరలిస్తున్నట్లు గుర్తించారు. కాగా నిందితులపై కేసు నమోదు చేశారు.కాగా గత మూడేళ్లలో రూ.71 కోట్లు విలువచేసే 176 మెట్రిక్ టన్నుల ఎర్రచందనం విదేశాలకు తరలివెళ్లకుండా డిఆర్‌ఐ అధికారులు సీజ్ చేశారు.