ఆంధ్రప్రదేశ్‌

కాణిపాకం వరసిద్ధివినాయకుని బ్రహ్మోత్సవాలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐరాల , ఆగస్టు 26: చిత్తూరు జిల్లా కాణిపాకంలో శ్రీ వరసిద్ధి వినాయకుని వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. 21 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ ఆలయంలో ధ్వజ స్థంభానికి ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య శనివారం ధ్వజారోహణ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. దీంతో ఈ బ్రహ్మోత్సవాలకు నాంది పలికినట్టయింది. ఈ సందర్భంగా శనివారం స్వామి వారి మూలవిరాట్‌కు వేద పండితులు అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ధ్వజారోహణ వేడుకలను కనుల పండువగా చేపట్టారు. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని స్వామి వారు రోజుకో వాహనంలో కాణిపాకం మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున చవితి పర్వదినమైన శుక్రవారం దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు, చిత్తూరు ఎమ్మెల్యే డి ఎ సత్యప్రభ స్వామి వారికి పట్టు వస్త్రాలను అందజేశారు. ఉత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి స్వామి వారు హంస వాహనంపై మాడవీధుల్లో విహరించారు. ఈ క్రమంలోనే ఆలయం తరఫున పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ వేడుకల్లో ఆలయ ఇ ఓ పూర్ణచంద్రరావుతో పాటు పలువురు ఉభయదారులు, ఆలయ అర్చకులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

చిత్రం..కాణిపాకం వరసిద్ధి వినాయకుని ఆలయంలో ధ్వజారోహణ నిర్వహిస్తున్న అర్చకస్వాములు