ఆంధ్రప్రదేశ్‌

‘విరాట్’ ప్రాజెక్టుకు కదలిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 26: భారత నౌకాదళంలో విశేష సేవలందించిన విమాన వాహక యుద్ధ నౌక ఐఎన్‌ఎస్ విరాట్‌ను టూరిజం ప్రాజెక్టుగా తీర్చిదిద్దే ప్రతిపాదనకు మళ్లీ కదలిక వచ్చింది. ఇతర రాష్ట్రాలతో పోటీపడి విరాట్‌ను పర్యాటక ప్రాజెక్టుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశాన్ని దక్కించుకుంది. అయితే, ఈ భారీ యుద్ధ నౌకను పర్యాటక ప్రాజెక్టుగా మార్చడం అత్యంత వ్యయప్రయాసలతో కూడుకున్న వ్యవహారం కావడంతో కొంత కాలంగా తర్జనభర్జనలు కొనసాగుతున్నాయి. దాదాపు రూ.1000 కోట్ల వ్యయమయ్యే ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా చేపట్టడం సాధ్యం కాదన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మాత్రం విరాట్ టూరిజం ప్రాజెక్టును ఎలాగైనా సాధించి తీరాలన్న లక్ష్యంతోనే ముందుకు సాగుతోందనే చెప్పాలి. విరాట్ యుద్ధ నౌకను విశాఖ తీరంలో ఐదు నక్షత్రాల హోటల్‌గా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ ఆలోచన. అంతస్తులుగా ఉండే ఈ నౌకలో 120 పడకల హోటల్‌తో పాటు కనె్వన్షన్ సెంటర్, రెస్టారెంట్, ఎంటర్‌టైన్‌మెంట్ జోన్, కమర్షియల్ స్పేస్ వంటివి ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. అయితే, భారీ వ్యయమయ్యే ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు కేంద్ర సాయం కోరేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొంతకాలంగా యత్నిస్తున్న సంగతి విదితమే. విరాట్ నౌకను పర్యాటక ఆకర్షణగా తీర్చిదిద్దేందుకు అవసరమైన టెక్నో, ఎకనమిక్ ఫీజుబిలిటీ(టిఇఎఫ్) సర్వే బాధ్యతను ప్రభుత్వం చెన్నైకి చెందిన నటెక్స్ మేరీటైం ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు అప్పగించింది. ఈ సంస్థ త్వరలోనే విశాఖ సాగరతీరంలో విరాట్ పర్యాటక ప్రాజెక్టును నెలకొల్పేందుకు అనువైన స్థలాన్ని నిర్ణయిస్తుంది. రుషికొండ నుంచి భీమునిపట్నం మధ్య సాగరతీరంలో విరాట్ నౌక పర్యాటక ప్రాజెక్టు ఏర్పాటుకు గల అవకాశాలను పరిశీలిస్తుందని కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ శనివారం తెలిపారు. ప్రభుత్వ,ప్రైవేటు భాగస్వామ్యంలో నెలకొల్పే ఈ ప్రాజెక్టుకు కేంద్ర పర్యాటకశాఖ నిధులు కేటాయించాలని ప్రభుత్వం ఇప్పటికే కోరింది. కేంద్ర పర్యాటక శాఖ రాష్ట్రంలో బుద్దిస్ట్ సర్క్యూట్‌కు అంగీకారం తెలపడంతో పాటు రూ.100 కోట్ల నిధులను కేటాయించింది. విశాఖలోని శాలిగుండం, తొట్లకొండ, బావికొండ, బొజ్జన్నకొండ సహా అమరావతి, నాగార్జున కొండలను బుద్దిస్ట్ సర్క్యూట్‌గా తీర్చిదిద్దుతున్నారు. పనులు కూడా చురుగ్గా జరుగుతున్నాయి. పర్యాటకాన్ని ప్రోత్సహించే చర్యల్లో భాగంగా విరాట్ ప్రాజెక్టుకు కూడా కేంద్రం సహకరిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.