ఆంధ్రప్రదేశ్‌

ఉపరాష్టప్రతికి ఘన స్వాగతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఆగస్టు 26: ఉప రాష్టప్రతిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత రాష్ట్రానికి వచ్చిన తెలుగుతేజం ముప్పవరపు వెంకయ్యనాయుడుకు ఘనస్వాగతం లభించింది. రాష్ట్రప్రభుత్వం ఆయనకు చేసిన పౌరసన్మానం కూడా అంగరంగ వైభవంగా జరిగింది. గన్నవరం విమానాశ్రయం నుంచి వెలగపూడి సచివాలయం వరకూ దారిపొడవునా ఉపరాష్టప్రతిని స్వాగతిస్తూ స్వాగత ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా వెంకయ్య రాష్ట్రానికి చేసిన సేవలకు కృతజ్ఞతగా, విద్యార్థులు రూపొందించిన కిలోమీటరు పొడవున్న జాతీయ పతాకం అందరినీ ఆకట్టుకుంది. ఎయిర్‌పోర్టు నుంచి ప్రకాశం బ్యారేజీ వరకూ స్వాగత ఏర్పాట్లు చేశారు. తెలుగు ప్రజలు తనకు చేసిన సన్మానం జీవితంలో మరువలేనని వెంకయ్య అన్నారు. శనివారం ఉదయం గన్నవరం విమానాశ్రయం నుండి బయలుదేరి ప్రకాశం బ్యారేజ్ వరకు 23 కిలోమీటర్ల మేర అడుగుడుగునా విద్యార్థులు జాతీయ జెండాను చేతబట్టి దారి పొడవునా ఉప రాష్టప్రతికి జేజేలు పలుకుతూ హర్షధ్వానాలతో ఘనస్వాగతం పలికారు. ఉప రాష్టప్రతి విమానాశ్రయం నుండి బయలుదేరగానే వివిధ కళా బృందాలు రకరకాల వేషధారణలతో నృత్యాలతో ప్రదర్శన చేస్తూ ఘనంగా స్వాగతం పలికారు. ఎక్కడా ఎలాంటి అపశ్రుతులు దొర్లకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.