ఆంధ్రప్రదేశ్‌

నన్ను బ్లాక్‌మెయల్ చేస్తున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, మే 17: తన కుమార్తె అశ్లీల చిత్రాలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తామని బెదిరిస్తున్న నిందితులపై తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు చెందిన ఓ న్యాయవాది జాతీయ మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. ఒక ప్రజాప్రతినిధి అనుచరులకు, తనకు మధ్య గల భూవివాదాల కారణంగా తనపై ఈ విధంగా కక్ష గట్టినట్టు ఆయన పేర్కొన్నారు. దీంతో మానవ హక్కుల సంఘం దీనిపై సమగ్ర విచారణకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించినట్టు బాధితుడు మంగళవారం విలేఖరులకు వివరించారు. ఇందుకు సంబంధించి బాధితుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తన కుమార్తె అర్ధనగ్న ఫొటోలను కొందరు నిందితులు తనకు చూపించి, బెదిరిస్తున్నారంటూ కాకినాడ రామారావుపేటకు చెందిన ఒక న్యాయవాది ఈ ఏడాది జవనరి 26న రెండో పట్టణ పోలీసులను ఆశ్రయించారు. అయితే నిందితులు ప్రజాప్రతినిధి అనుచరులు కావడంతో పోలీసులు ఈ విషయాన్ని పట్టించుకోలేదని, గత్యంతరం లేని స్థితిలో జాతీయ, రాష్ట్ర మానవ హక్కుల సంఘాలను ఆశ్రయించినట్టు తెలిపారు.
గతంలో హైదరాబాద్‌లోని సిఐడి అధికారులకు కూడా ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. తర్వాత మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించడంతో రాష్ట్ర డిజిపిని దీనిపై తక్షణం విచారించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించినట్టు ఆయన వివరించారు.
న్యాయవాది ఆరోపణలు
అవాస్తవం: డిఎస్పీ
ఒక ప్రజాప్రతినిధి అనుచరులపై కాకినాడకు చెందిన న్యాయవాది చేసిన ఆరోపణల్లో ఎంతమాత్రం వాస్తవం లేదని కాకినాడ డిఎస్పీ ఎస్.వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ వ్యవహారంపై ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారం కావడంతో మంగళవారం రాత్రి డిఎస్పీ విలేఖర్లతో మాట్లాడారు. ప్రజాప్రతినిధి అనుచరులు తన కుమార్తె అశ్లీల చిత్రాలతో బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్నట్టు న్యాయవాది మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించిన మాట వాస్తవమేనని, దీనిపై విచారణ జరపాలని కమిషన్ తమను ఆదేశించిందన్నారు.
అయితే తన కుమార్తెను ప్రజాప్రతినిధి అనుచరులు వేధిస్తున్నట్టు పేర్కొన్న ఏ ఒక్క ఆధారాన్ని, ఫొటోలను న్యాయవాది తమకు చూపలేకపోయారని డిఎస్పీ తెలిపారు. అదే విషయాన్ని తాము కమిషన్‌కు నివేదించామన్నారు.
సదరు న్యాయవాది మానసిక స్థితి కూడా సక్రమంగా లేదని తమ దర్యాప్తులో వెల్లడయ్యిందని డిఎస్పీ వివరించారు.