ఆంధ్రప్రదేశ్‌

స్వల్పంగా పెరుగుతున్న గోదావరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఆగస్టు 28: అఖండ గోదావరి నదిలో వరద ప్రవాహం స్వల్పంగా పెరుగుతోంది. స్థానిక పరీవాహ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల వల్ల గోదావరి నదిలో వరద ప్రవాహం పెరుగుతోంది. సోమవారం ధవళేశ్వరం కాటన్ బ్యారేజి వద్ద 10.80 అడుగుల నీటి మట్టం నమోదైంది. గత ఇరవై నాలుగు గంటలుగా కురుస్తోన్న భారీ వర్షాల వల్ల తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. డొంకరాయి సమీపంలోని సోకిలేరు వరద పోటుతో ఉరకలేస్తోంది. సీలేరులో భారీగా వరద జలాలు పోటెత్తాయి. గోదావరి ఉప నది శబరికి కూడా వరద ఉద్ధృతి తాకింది. తూర్పు కనుమల్లో భారీగా వర్షాలు పడుతుండటంతో ఎక్కడికక్కడ వాగులు, వంకలు పొంగిపొర్లి గ్రామాల మధ్య రాకపోకలు స్తంభిస్తున్నాయి. సీలేరు నుంచి సోమవారం ఐదు వేల క్యూసెక్కుల వరద జలాలను దిగువ ప్రాంతానికి విడుదల చేశారు. దీంతో ఏజెన్సీలోని డొంకరాయి, మోతుగూడెం తదితర జలాశయాలన్నీ నిండుకుండల్లా మారాయి. ఈ నేపథ్యంలో శబరి నది పరీవాహక ఏజెన్సీ ప్రాంతాన్ని రంపచోడవరం ఐటిడిఎ పిఒ దినేష్‌కుమార్ అప్రమత్తం చేశారు.
మరో వైపు గోదావరి నదిలో వరద ప్రవాహం పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజి గేట్లను 0.3 మీటర్ల మేర ఎత్తి, 1.48 లక్షల క్యూసెక్కుల వరద జలాలను సముద్రంలోకి విడిచిపెట్టారు. ఎగువ ప్రాంతంలో ఒక్కో సెంటీ మీటర్ చొప్పున వరద నీటి ప్రవాహం పెరుగుతోంది. అఖండ గోదావరి నది ఎగువ ప్రాంతంలో భద్రాచలం వద్ద 19.01 అడుగుల నీటి మట్టం నమోదైంది. కాళేశ్వరం వద్ద 3.56 మీటర్లు, పేరూరు వద్ద 5.23, దుమ్ముగూడెం వద్ద 6.63, కూనవరం వద్ద 6.93, కుంట వద్ద 7.02, కొయిదా వద్ద 8.34, పోలవరం వద్ద 6.34 మీటర్ల నీటి మట్టం నమోదైంది.

చిత్రం..తూర్పు గోదావరి జిల్లా విఆర్‌పురం మండలంలో అలుగుల పైనుంచి
ప్రవహిస్తున్న మొద్దులగూడెం చెరువు