ఆంధ్రప్రదేశ్‌

భవిష్యత్తు కార్యాచరణపై రేపు నిర్ణయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రత్తిపాడు, ఆగస్టు 28: కాపు ఉద్యమ భవిష్యత్తు కార్యాచరణ బుధవారం జరిగే జెఎసి సమావేశంలో నిర్ణయిస్తామని కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ప్రకటించారు. కిర్లంపూడి నుంచి వీరవరం వరకూ ఆదివారం జరిగిన ఆకస్మిక పాదయాత్రకు కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం అంతా తనదేనని, తన వెనుక ఎవరూ లేరని, ఆ బాధ్యత తనదేనని ముద్రగడ స్పష్టం చేశారు. ప్రతి రోజు ఇంటి నుంచి బయటకు వచ్చి, గేటు వద్ద పోలీసులను పలకరించి వెళ్లిపోతున్నానని, పాదయాత్ర చేసే సత్తా తనకు లేదని ముఖ్యమంత్రి చేసిన అవహేళనను సవాల్‌గా స్వీకరించి, పాదయాత్ర చేసి చూపించానన్నారు. అడుగు వెయ్యనివ్వమని వారు చెబితే ఏడు కిలోమీటర్ల మేర నడిచి చూపించానన్నారు. తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలోని తన నివాసగృహంలో సోమవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ, పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ, రాజమహేంద్రవరం అర్బన్ ఎస్పీ, రంపచోడవరం ఎఎస్పీ తదితర పోలీసు అధికారులు పాదయాత్రను ఆపమని కోరినందున తాను వారి మాటకు విలువనిచ్చి స్వచ్ఛందంగా పోలీసుల వ్యాన్లో కూర్చున్నానని చెప్పారు. తనని ఎవరూ బలవంతంగా ఆపలేదన్నారు. ‘మీరు ఆపుతారా?..నన్ను రమ్మంటారా’ అని డిజిపి అన్నట్లుగా వార్తలు వచ్చాయని, ‘ఆయన వస్తే కాల్చేస్తారా?’ అని ముద్రగత ఆగ్రహం వ్యక్తంచేశారు. పాదయాత్రలో పాల్గొన్న అమాయకులపై లాఠీఛార్జీ చేసి, కేసులు నమోదుచేశారని, ‘పాదయాత్ర చేయడం పాపమా?.., ప్రజాస్వామ్యంలో లేమా’ అని ప్రశ్నించారు. డిజిపిగా నండూరి సాంబశివరావు బాధ్యతలు స్వీకరించిన కొత్తలో ఉద్యమ విషయంపై లేఖ రాసినట్టు తెలిపారు. పాదయాత్ర ప్రకటనకు ముందు డిజిపి ఒక పెద్ద మనిషిని రాయబారానికి పంపారని, ఆ వ్యవహారాన్ని మధ్యలోనే ఎందుకు వదిలేశారని ముద్రగడ ప్రశ్నించారు. కాపు ఉద్యమం వెనుక ఎవరూ లేరని, ముద్రగడ పిలుపునకు ఎవరూ రారని తప్పుడు సమాచారం ఇంటిలిజెన్స్ ఐజి ప్రభుత్వానికి ఇస్తున్నారన్నారు. తుని సభకు కూడా పదివేలమందికి మించి రారని, అదే ఇంటిలిజెన్స్ ఐజి అప్పట్లో సమాచారం ఇచ్చారని, ముందుగా ఇంటిలిజెన్స్ ఐజిని మార్చుకుంటే మంచిదని ముఖ్యమంత్రికి సూచించారు. ఎప్పట్లోగా కాపులను బిసిలో చేరుస్తారో చెప్పాలని ముద్రగడ డిమాండు చేశారు. తన పాదయాత్రలో స్థానిక పోలీసు యంత్రాంగం వైఫల్యం ఉందని, అందుకు బాధ్యులపై చర్యలు తీసుకుంటామని డిజిపి చెబుతున్నారని, ఈ విషయంలో కిందిస్థాయి అధికారులను బలిపశువులను చేయడం తగదన్నారు.