ఆంధ్రప్రదేశ్‌

స్ఫూర్తి చిహ్నం ‘గురజాడ’ గృహం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, ఆగస్టు 28: కళలకు కాణాచి విజయనగరంలోని గురజాడ గృహాన్ని అందరికీ స్ఫూర్తినిచ్చేలా తీర్చిదిద్దుతామని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. భాషా సాంస్కృతిక మండలి ఆధ్వర్యంలో 125 ఏళ్ల కన్యాశుల్కం జాతీయ ఉత్సవాల ముగింపు రోజు సందర్భంగా సోమవారం గురజాడ గృహంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రి గంటా శ్రీనివాసరావు, మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ హాజరయ్యారు. ముందుగా గురజాడ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం గురజాడ గృహంలో రజత ఫలకాన్ని, సావనీర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ కన్యాశుల్కం నాటికలో ప్రతి పాత్ర ఒక సజీవపాత్ర అని, ఈ నాటకానికి మరింత ప్రాచుర్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఇంటర్నెట్‌కు అతుక్కుపోతున్న నేటి యువతరానికి కన్యాశుల్కం తెలియాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. గురజాడకు గుర్తుగా కవులు, కళాకారులు, క్రీడాకారులకు మెమెంటోలను అందజేసేటపుడు వాటిలో గురజాడ చిహ్నం ఉండేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గురజాడ రాసిన ‘కన్యాశుల్కం’ నాటకానికి 125 ఏళ్లు గుర్తుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున రజత ఫలక ప్రతిష్ఠాపన కార్యక్రమం చేపట్టామని మొజాయిక్ సాహితీ సంస్ధ అధ్యక్షుడు రామతీర్ధ వివరించారు. కన్యాశుల్కం సాంస్కృతిక శోభ కింద రాష్ట్రంలోని అన్ని ముఖ్య కేంద్రాల్లో ఏడాది కాలం కన్యాశుల్కం నాటకం ప్రదర్శించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ స్వాతిరాణి, ఎమ్మెల్సీ సంద్యారాణి, ఎమ్మెల్యే మీసాల, డాక్టర్ ఎ.గోపాలరావు, కాపుగంటి ప్రకాష్, డాక్టర్ బిఎస్‌ఆర్ మూర్తి, లోక్‌సత్తా రాష్ట్ర అధ్యక్షుడు బాబ్జి, రచయితలు చీకటి దివాకర్, జగద్ధాత్రితోపాటు పలువురు సాహితీవేత్తలు, అభిమానులు పాల్గొన్నారు.
గురజాడ అంటే చిన్న చూపా?
తెలుగు జాతికి వెలుగు చూపిన గురజాడ అప్పారావు రాసిన కన్యాశుల్కం 125 ఏళ్ల ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజులపాటు నిర్వహించినప్పటికీ ఆ కార్యక్రమానికి రావడానికి మంత్రులకు తీరికలేకుండా పోయిందని లోక్‌సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి విమర్శించారు.

చిత్రం..మహాకవి గురజాడ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న మంత్రి గంటా శ్రీనివాసరావు