ఆంధ్రప్రదేశ్‌

బాధితులకు బాబు బాసట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 28: సాయం కోసం వచ్చిన పలువురికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బాసటగా నిలిచారు. అవసరమైన ఆర్థిక సాయం అందించారు. గుంటూరు జిల్లా పొత్తూరు నుంచి వచ్చిన గుమ్మడి సుమన్ (17) చిన్నపుడు తగిలిన దెబ్బతో ఆరోగ్యం దెబ్బతిని ఉన్న కొద్దిపాటి ఆస్తి కరిగిపోయింది. ప్రత్యేక చికిత్స చేస్తే అతడికి తెలివి వస్తుందని వైద్యులు చెప్పటంతో తల్లితండ్రులు సోమవారం ముఖ్యమంత్రిని కలిశారు. వెంటనే అతడి వైద్య చికిత్సకు ముఖ్యమంత్రి రూ. 2లక్షలు మంజూరు చేశారు. తిరుపతి నుంచి వచ్చిన హరిణి చౌదరికి 2015లో పృధ్వీరాజ్‌తో వివాహమైంది. అతడు భార్యపై అనుమానంతో గర్భస్రావం చేయించాడు. హింసించ సాగాడు. ఆమె ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ వర్కింగ్ ఉమెన్ హాస్టల్‌లో ఉంటోంది. తరచూ హాస్టల్‌కు వచ్చి తీసుకెళ్ళేందుకు ప్రయత్నిస్తూ హింసకు గురి చేస్తున్నాడు. తండ్రి, బావ, అక్కతో కలిసి తరచూ తనను వేధిస్తున్నాడని, తనకు అతడి నుంచి ప్రాణభయం ఉందని, విడాకులు ఇప్పించాలని ముఖ్యమంత్రిని వేడుకుంది. ఆమె కష్టాలను విన్న ముఖ్యమంత్రి ఈ ఫిర్యాదును మహిళా కమిషన్‌కు పంపించాలని, తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాధితురాలు హరిణికి రూ. 2 లక్షల సాయం ప్రకటిస్తూ ధైర్యంగా ఉండాలని కోరారు. హరిణికి ఉపాధి కల్పించే విషయాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. విజయవాడ నుంచి వచ్చి ముఖ్యమంత్రిని కలిసిన షాహినా అనే బాలికది మరీ దైన్య పరిస్థితి. తల్లి, తండ్రి ఇద్దరూ హెచ్‌ఐవి పాజిటివ్‌తో చనిపోయారు. తానూ హెచ్‌ఐవి బాధితురాలు. సమాజంలో నిరాదరణకు గురైంది. ప్రస్తుతం నాయినమ్మ సంరక్షణలో పెరుగుతోంది. ఆమె పరిస్థితికి స్పందించిన ముఖ్యమంత్రి రూ. 2 లక్షలు మంజూరు చేశారు. గుంటూరు జిల్లా నీరుకొండ నుంచి వచ్చిన ఎం రవి అనే యువకుడు తన కాలేయమార్పిడికి శస్త్ర చికిత్సకు రూ. 28 లక్షల వ్యయం అవుతుందని చెప్పగా ముఖ్యమంత్రి రూ. 10 లక్షలు మంజూరు చేశారు. మిగిలిన వ్యయాన్ని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సదరు కార్పొరేట్ ఆసుపత్రి భరించే విధంగా అసుపత్రి యాజమాన్యానికి లేఖ రాయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఇదిలా ఉంటే అనారోగ్యంతో వచ్చి ఎన్టీఆర్ వైద్యసేవ, ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి సహాయం పొందలేని వారికి నెలనెలా వారి వైద్య చికిత్సకు కొంత ఆర్థిక సాయం చేయాలని కడప జిల్లా రాజంపేట నుంచి వచ్చిన శవన వెంకట సుబ్బనాయుడు ముఖ్యమంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఆర్థిక సమస్యలతో జరుగుబాటులేని ఒక పేదరాలికి రూ. 50వేలు మంజూరు చేశారు.