ఆంధ్రప్రదేశ్‌

త్వరలోనే నీరు-ప్రగతి ఫలాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఆగస్టు 28: ఇదే విధంగా మరో మూడేళ్లు కృషిచేస్తే నీటి కొరత తీరిపోతుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ‘నీరు-ప్రగతి’ పురోగతిపై సోమవారం తన నివాసం నుంచి జిల్లా కలెక్టర్లు, ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. దశాబ్దాలుగా సతమతం చేస్తున్న నీటి సమస్యను అధిగమించేందుకు చేపట్టిన ‘నీరు-ప్రగతి’ కార్యక్రమ ఫలితాలు అందే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. ఒకవైపు నంద్యాల ఫలితాలు, మరోవైపు కాకినాడ ఎన్నికలు ఉన్నప్పటికీ ఈరోజు తాను టెలికాన్ఫరెన్స్ నిర్వహించడమే ‘నీరు-ప్రగతి’ పురోగతికి ఇస్తున్న ప్రాధాన్యంగా తెలిపారు. గత ఏడాది ఆగస్ట్ 28కన్నా భూగర్భ జలాలు ప్రస్తుతం 1.93 మీటర్లు పెరిగాయన్నారు. పట్టుదలతో కృషిచేసి మిగులు విద్యుత్ సాధించామని, అదే విధంగా మిగులు జలాలు కూడా సాధించాలన్నదే తన ఆకాంక్షగా తెలిపారు. అధికారంలోకి వచ్చినప్పుడు 23 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొరత ఉన్న విషయం గుర్తుచేసి, దాన్ని అధిగమించిన స్ఫూర్తితోనే ప్రస్తుతం సాగు, తాగునీటి కొరతను కూడా అధిగమించాల్సి ఉందన్నారు. గండికోట రిజర్వాయర్‌ను నింపి అక్కడ నుంచి చిత్తూరుకు సాగునీరు అందించాలన్నదే తన ధ్యేయమన్నారు. ప్రతి ఏటా వేలాది టిఎంసిల నీరు గోదావరి నుంచి సముద్రంలోకి వృథాగా పోతున్న విషయం గుర్తుచేశారు. ఎగువన ఉన్న రిజర్వాయర్ల నుంచి ఇన్‌ఫ్లో లేక కృష్ణానది ప్రాజెక్ట్‌లకు నీరు రావటం లేదన్నారు. ఏ పరిస్థితినైనా అధిగమించేలా రాష్ట్రంలో జల వనరులను అభివృద్ధి చేసుకోవాల్సి ఉందన్నారు. నీటి వినియోగంలో సాంకేతికత, ఆధునిక పరిజ్ఞానం ప్రధానాంశాలంటూ ఇజ్రాయిల్ సముద్ర జలాలను కూడా డిశాలినేట్ చేసి సద్వినియోగం చేసుకుంటున్న విషయం ప్రస్తావించారు. ప్రస్తుత ఖరీఫ్‌లో సాధారణం కన్నా 1.9 శాతం వర్షపాతం అధికంగా పడిందన్నారు. ఎక్కడ పడిన వాన నీటిని అక్కడే ఇంకేలా శ్రద్ధ వహించాలన్నారు. నరేగా (ఉపాధి హామీ పథకం) ఇంటర్నల్ ఆడిట్ సెప్టెంబర్ 5కల్లా పూర్తిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. నిధుల కన్వర్జెన్స్ చేసి 20 శాఖలతో ఉపాధి హామీని అనుసంధానం చేయడం వల్ల మలిదశ నరేగా పూర్తిగా సద్వినియోగం చేయగలిగామన్నారు. నరేగాలో ఏ మాత్రం తప్పు జరిగినా ఉపేక్షించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. సాయిల్ టెస్టింగ్‌లో దేశంలోనే ముందున్నామని చంద్రబాబు చెప్పారు. డ్రోన్ల ద్వారా సాయిల్ టెస్టింగ్ వినూత్న సాంకేతిక ప్రక్రియ అంటూ, దాన్ని అందుకోవాలన్నారు. బిల్ అండ్ మిలిందా ఫౌండేషన్ ప్రతినిధులు అందుకే సెప్టెంబర్ 28, 29న మన రాష్ట్రానికి వస్తున్నారని చెప్పారు. ఫౌండేషన్ ప్రతినిధులతో తాను కూడా భేటీ అవుతానన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కోటి ఎకరాల్లో పండ్ల తోటల సాగు జరగాలని, కోటి ఎకరాల్లో డ్రిప్ ఇరిగేషన్ అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేశారు. 30వేల అంగన్‌వాడీ భవనాలకు వెంటనే కరెంట్ కనెక్షన్లు, తాగునీటి సదుపాయం కల్పించాలని ఆదేశించారు. ‘మా గ్రామం-మా శుభ్రత’ కార్యక్రమాన్ని 40 గ్రామాల్లో మోడల్ ప్రాజెక్ట్‌గా చేపట్టిన పశ్చిమగోదావరి జిల్లా యంత్రాంగానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు తెలిపారు. ప్రజాశక్తిని నెగటివ్ మార్గాలవైపు మళ్లించరాదన్నారు. డేరాబాబా లాంటివాళ్లు ప్రజాశక్తిని పక్కదారి పట్టించడం వల్ల నెలకొన్న విధ్వంసం, అరాచకాన్ని అందరూ గుర్తించి అప్రమత్తం కావాలన్నారు. ముందుకు నడిపించేవాడే నాయకుడు తప్ప పతనం చేసేవాడు నాయకుడు కాదని అన్నారు.