ఆంధ్రప్రదేశ్‌

బాబు ఇంట విజయోత్సవ సంబరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 28: నంద్యాల ఉప ఎన్నికలో సాధించిన ఘన విజయంతో ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నివాసం లోపల, వెలుపల అంగరంగ వైభవంగా విజయోత్సవ సంబరాలు జరిగాయి. ఫలితాలు వెలువడుతున్న సమయంలోనే రాష్ట్ర మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, అచ్చెన్నాయుడు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ ఎల్‌విఎస్‌ఆర్‌కె ప్రసాద్, ఎమ్మెల్సీ టిడి జనార్ధన్, తదితరులు వెళ్లి బాబుతోపాటు తనయుడు, మంత్రి లోకేష్‌ను కల్సి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా బాబు తనను అభినందించడానికి వచ్చినవారందరికీ కేక్ తినిపించారు. మహిళా నేతలు, కార్యకర్తలు అతి పెద్ద సంఖ్యలో వచ్చి బాబును అభినందించారు. నివాస గృహం ఎదుట కరకట్టపై పెద్దఎత్తున బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. అభిమానులు, కార్యకర్తలు ఆనందంతో నృత్యాలు చేశారు.
సచివాలయంలో కోలాహలం..
ఎంతో ప్రతిష్టాకరంగా జరిగిన నంద్యాల ఉప ఎన్నికలో అధికారపక్ష తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడంతో వెలగపూడి సచివాలయంలో కోలాహలం నెలకొంది. రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులు, ఎంపిలు, వివిధ జిల్లాల సీనియర్ నేతలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి బాబుకు స్వీట్లు తినిపించి వందనాలతో ముంచెత్తారు.

చిత్రం..చంద్రబాబుతో కేక్ కట్ చేయిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు