ఆంధ్రప్రదేశ్‌

గురి తప్పిన జ‘గన్’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఆగస్టు 28: రాష్ట్ర రాజకీయాలపై వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి అంచనాల గురి తప్పుతున్నట్లు కనిపిస్తోంది. వైసీపీకి తిరుగులేని పట్టున్న రాయలసీమలో పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. ఆ పార్టీకి పట్టుకొమ్మలుగా భావించే ముస్లిం మైనారిటీలు, ముద్రగడ ఆందోళన వల్ల కలసివస్తాయనుకుంటున్న బలిజ, కాపు వర్గాలు దూరమవుతున్నాయా? అభ్యర్థిపై ముస్లింలు వ్యతిరేకంగా ఉన్నారని తెలిసినా మొండిగా ముందుకువెళ్లినందుకే మూల్యం చెల్లించుకోవలసి వచ్చిందని నంద్యాల ఫలితాలు రుజువు చేస్తున్నాయి.నంద్యాల ఉప ఎన్నికలో టిడిపికి భారీ మెజార్టీని ఊహించని వైసీపీ శ్రేణుల్లో నైరాశ్యం కనిపిస్తోంది. అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డికి స్థానికంగా మెజారిటీ సంఖ్యలో ఉన్న ముస్లింలతో వైరం ఉన్న విషయం తెలిసినా పట్టించుకోకుండా తనను నమ్మి పార్టీలోకి వచ్చారన్న కారణంతో ఆయనకు సీటు ఇవ్వడమే కొంప ముంచిందని పార్టీ వర్గాలంటున్నాయి. పార్టీకి పట్టున్న రాయలసీమలో కొద్దినెలల తేడాతో రెండో పరాజయం ఎదురుకావటం ఆ పార్టీకి ఇబ్బందే. వైఎస్ సోదరుడయిన వివేకానందరెడ్డిని కడపలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించుకోలేని దుస్థితి ఎదురైతే, మళ్లీ ఇప్పుడు కీలకమైన నంద్యాల ఉప ఎన్నికలో ఓడిపోవడం అవమానకరంగా మారింది. కడపలో జగన్‌పై తిరుగుబాటు చేసిన ఆదినారాయణరెడ్డికి మంత్రి పదవి ఇవ్వడం ద్వారా చంద్రబాబు తమ పార్టీని దెబ్బతీశారని వైకాపా నేతలు అంటున్నారు. నంద్యాల ఎన్నికలో ముస్లిం, వైశ్య, కాపు-బలిజ, బీసీ వర్గాలు టిడిపికి పట్టం కట్టినా తమ పార్టీని రెడ్డి, క్రైస్తవ, మాల వర్గాలు ఆదుకోవడం కొంతలో కొంత ఊరట. ముద్రగడ ఆందోళనకు తెరవెనుక ఉండి దన్నుగా నిలిచినా ఆ వర్గం టిడిపికే జైకొట్టారు. కర్నూలు, నంద్యాల, కడప వంటి ప్రాంతాల్లో అధికంగా ఉన్న ముస్లింలు కూడా పార్టీకి దూరమైతే, సీమపై వైకాపా ఆశలు వదులుకోవలసిందే.
కొంపముంచిన కారణాలివే..
* బాబుపై జగన్ అనుచిత వ్యాఖ్యలు చేయటం * ఎమ్మెల్యే రోజా చేసిన వ్యాఖ్యలు ఓటర్లకు రుచించకపోవటం * మాజీ ఎంపి గంగుల ప్రతాపరెడ్డి టిడిపిలో చేరటం * పీకే, సొంత మీడియా బృందం ఇచ్చిన అవాస్తవిక నివేదికలపై విశ్వాసం * వైసీపీకి ఓటేస్తే అభివృద్ధి ఆగిపోతుందేమోనన్న ప్రజల ఆందోళనను సరిదిద్ది భరోసా ఇవ్వడంలో విఫలం. * పోల్ మేనేజ్‌మెంట్‌లో విఫలం * జగన్ ఇమేజి, సొంత మీడియాలో సర్కారుపై వచ్చే వ్యతిరేక వార్తలపైనే ఆధారపడటం.