ఆంధ్రప్రదేశ్‌

చక్రం తిప్పిన సోమిరెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల, ఆగస్టు 28: నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నిక విజయం వెనుక టిడిపి మంత్రుల నిరంతర శ్రమ కొట్టిచ్చినట్లు కనిపిస్తోంది. ప్రచార బాధ్యతలను మొత్తం తన భుజస్కంధాలపై వేసుకున్న వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ప్రణాళికాబద్దంగా టిడిపిని విజయతీరాలకు చేర్చడంలో కృతకృత్యులయ్యారని చెప్పాలి. కడప జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా ఉన్న సోమిరెడ్డి ఆ జిల్లాలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ అభ్యర్థిని గెలిపించుకోవడానికి పన్నిన ఎత్తుగడ వైకాపాను దిమ్మతిరిగేలా చేసింది. వైకాపా బలంగా ఉన్న కడప జిల్లాలో వైకాపా అధినేత జగన్ బాబాయి వైఎస్ వివేకానందరెడ్డిపై బిటెక్ రవిని పోటీకి నిలిపి పక్కావ్యూహంతో ఘన విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించారు. దీంతో సిఎం చంద్రబాబు నంద్యాల ఉప ఎన్నిక బాధ్యతను సైతం సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి అప్పగించారు. ఈయనకు తోడు మంత్రులు కాలవ శ్రీనివాసులు, అమరనాధరెడ్డి, ఆదినారాయణరెడ్డితోపాటు మరో పాతిక మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలసికట్టుగా పనిచేసి తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించేందుకు ముఖ్య కారకులయ్యారు. సియంవో ఆదేశాలతో తెలుగుదేశం పార్టీ నంద్యాల ఉప ఎన్నికలో సూక్ష్మ ప్రణాళికను పక్కాగా అమలు చేసింది. నంద్యాల అసెంబ్లీ ఓటర్ల జాబితాలో ప్రతి వంద మంది ఓటర్లను తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్న చోటా నేతకు బిఎల్‌ఓగా బాధ్యతలు అప్పగించి వారిపై వార్డు కౌన్సిలర్, ఇన్‌చార్జిలతోపాటు స్థానిక నేతలు మాజీమంత్రి ఎన్‌ఎండి ఫరూక్, డా.నౌమాన్, డా. ఇంతియాజ్ అహ్మద్, ఎవి సుబ్బారెడ్డి, ఎంపి ఎస్పీవైరెడ్డి, ఆయన అల్లుడు శ్రీ్ధర్‌రెడ్డి తదితరులు నియోజకవర్గంలోని వార్డులు, గ్రామాలను పంచుకుని తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించారు. వీరిపై ప్రతి పది వేల ఓట్లకు ఒక టిడిపి ఎమ్మెల్యే బాధ్యత తీసుకుని సూక్ష్మ ప్రణాళికను పక్కాగా అమలు చేశారు.