ఆంధ్రప్రదేశ్‌

వైకాపా కనుమరుగు ఖాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 28: నంద్యాలలో తెదేపా అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డిని గెలిపించడం ద్వారా నంద్యాల ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాలన పట్ల ప్రజలు పూర్తి విశ్వాసాన్ని, నమ్మకాన్ని వ్యక్తం చేశారని, ఇది ప్రజా విజయమని మంత్రి శిద్దా రాఘవరావు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలో వైసీపీ కనుమరుగు కావటం ఖాయమని జోస్యం చెప్పారు. అభివృద్ధికి, అభివృద్ధి నిరోధకులకు మధ్య జరిగిన ఉప ఎన్నికలో ప్రజలు టిడిపి పక్షాన నిలబడి చారిత్రాత్మక తీర్పు వెలువరించారని హర్షం వ్యక్తం చేశారు. నంద్యాలలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఈ విజయం మరింత ఊతం ఇస్తుందని అభిప్రాయపడ్డారు.
నంద్యాలలో ఓటమిని అంగీకరించకుండా జగన్ విలువలు, విశ్వసనీయత గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని మంత్రి ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని అసభ్య పదజాలంతో దూషించడం ద్వారా నంద్యాలలో భయానక వాతావరణం సృష్టించి దాని ద్వారా లబ్ధి పొందాలనుకున్న జగన్ భంగపడ్డారన్నారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదని ప్రజలు తమ విలక్షణ తీర్పులో పేర్కొన్నారని అన్నారు.