ఆంధ్రప్రదేశ్‌

రెఫరెండం కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 28: నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో టిడిపి అభ్యర్థి గెలుపొందడం ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన రెఫరెండం కాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలా అనుకుంటే అంతకన్నా మూర్ఖుడు మరొకరు ఉండరని ఆయన విమర్శించారు. సోమవారం నంద్యాల ఉప ఎన్నిక ఫలితం వెలువడిన తర్వాత వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధైర్యం ఉంటే తమ పార్టీ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలందరితో రాజీనామా చేయించి తిరిగి గెలుపొందాలని డిమాండ్ చేశారు. ఒక్క నంద్యాల ఉప ఎన్నికల్లోనే 200 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని ఆయన ఆరోపించారు. తమ పార్టీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి తిరిగి పోటీ చేయించాలని, అప్పుడు ఎలా వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారో చూస్తామని ఆయన అన్నారు. నంద్యాల నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ అధికారాన్ని అడ్డుపెట్టుకుని విజయం సాధించిందని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని జగన్ విమర్శించారు. ఉప ఎన్నికల్లో వైకాపాకు ఓట్లు వేసిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా ప్రలోభాలు, భయభ్రాంతుల మధ్య పార్టీ కోసం గట్టిగా నిలబడి కష్టపడిన కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు చెప్పారు. నంద్యాల ఓటర్లను భయబ్రాంతులకు గురి చేసి గెలుపొందారని ఆయన విమర్శించారు. అధికార పార్టీ నుంచి పదవికి రాజీనామా చేసి తమ పార్టీలో చేరి రాజకీయాల్లో విలువలు అనే పదానికి అర్థం తీసుకుని వచ్చిన శిల్పా చక్రపాణిరెడ్డి, శిల్పా మోహన్‌రెడ్డిని అభినందిస్తున్నానని ఆయన తెలిపారు. తమ పార్టీ ఇప్పుడైనా, ఎప్పుడైనా విలువలకు కట్టుబడి ఉందని ఆయన తెలిపారు.