ఆంధ్రప్రదేశ్‌

విశాఖలో ప్రయోగాత్మకంగా సిటీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ప్లాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), ఆగస్టు 29: రాష్ట్రంలో అగ్నిప్రమాదాల నివారణ, విపత్తు నివారణ చర్యల విస్తృతికి అగ్నిమాపకశాఖ చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా ప్రధాన నగరాల్లో ‘సిటీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ప్లాన్’కు రూపకల్పన చేస్తున్నట్లు ఆ శాఖ ఈస్టరన్ రీజనల్ ఫైర్ ఆఫీసర్ జి శ్రీనివాసరావు చెప్పారు. ఇకనుంచి జిల్లాల వారీగా నెలకు వంద అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. విజయవాడలోని రాష్ట్ర అగ్నిమాపక శాఖ ప్రధాన కార్యాలయంలో ఈస్టరన్ రీజనల్ ఆఫీసర్‌గా కొత్తగా ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈసందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విజయవాడ, కృష్ణా, గోదావరి జిల్లాలతోపాటు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు తమ పరిధిలోకి వస్తాయని తెలిపారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా తన ప్రాధాన్యతలు వివరించారు. అగ్నిప్రమాదాలు నివారించేందుకు శాఖాపరంగా తీసుకుంటున్న ముందస్తు చర్యలతోపాటు, ప్రజల వైపు నుంచి కూడా అప్రమత్తతను కలుగచేసేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. తన రీజియన్‌లోని ఆరు జిల్లాల్లో ప్రతి ఫైర్ స్టేషన్ పరిధిలో నెలకు వంద చొప్పున ఆరు వందల కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. వీటి ద్వారా ప్రమాదాలు చోటు చేసుకోకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, ప్రమాదాలు సంభవించినప్పుడు, విపత్తుల సమయాల్లో ఎలా బయటపడాలి అనే అంశాలపై తమ బృందాలు వివరిస్తాయని, అదేవిధంగా తుఫాను, విపత్తు సమయాల్లో తమ వద్ద ఉన్న ఆధునిక సాంకేతిక సామగ్రి వినియోగం గూర్చి డెమో, మాక్‌డ్రిల్ ఉంటుందన్నారు. ఇదిలావుండగా ముఖ్యంగా ప్రధాన నగరాల్లో సిటీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ప్లాన్ ప్రవేశపెడుతున్నామని, ప్రయోగాత్మాంగా విశాఖపట్నంలో అమలు చేస్తామని ఆ తర్వాత దశలవారీగా ప్రధాన నగరాలకు ఈ విధానం విస్తరింపచేస్తామన్నారు. ఈ ప్రణాళిక ద్వారా అగ్నిప్రమాదాలకు ఆస్కారమున్న అంశాలను గుర్తించి ఇతర ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటూ ముందస్తు చర్యలు తీసుకుంటారన్నారు.