ఆంధ్రప్రదేశ్‌

మరో 15 మంది వైసిపి ఎమ్మెల్యేలు వస్తారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), ఆగస్టు 29: వైఎస్సార్ సిపి ఎమ్మెల్యే కొడాలి నాని ముఖ్యమంత్రి మీద చేసిన అభ్యంతర వ్యాఖ్యలను రాష్ట్ర ఎస్‌సి కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు. మంగళవారం విజయవాడ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రోజాకు పట్టిన గతే కొడాలి నానీకి కూడా పడుతుందన్నారు. నంద్యాల ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేని ప్రతిపక్ష వైసిపి నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారన్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో టిడిపి ఘన విజయం తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి సంక్షేమాన్ని చూసి మరో 15 మంది వైఎస్సార్ సిపి ఎమ్మెల్యేలు తెదేపాలోకి వస్తామంటున్నారన్నారు. జగన్ 13 రోజులు నంద్యాలలో తిష్టవేసి, ప్రచారం చేసి, రాష్టస్థ్రాయి వైఎస్సార్ సిపి నాయకులను తరలించి, డబ్బులు పంచినా ఘోర పరాజయం చవిచూశారని, దాంతో వైసిపి ఎమ్మెల్యేల్లో అంతర్మథనం మొదలైందన్నారు. నంద్యాల ఉప ఎన్నిక పరాజయంతోనైనా వైఎస్సార్ సిపి బుద్ధి తెచ్చుకోవాలన్నారు. నంద్యాల ఎన్నికల్లో నోరు పారేసుకున్న రోజాకు, ఓటర్లు ఏ విధంగా బుద్ధి చెప్పారో రేపు కొడాలి నానీకి కూడా ప్రజలు ఇదే విధంగా బుద్ది చెబుతారన్నారు. అధికార పార్టీయే ఉప ఎన్నికల్లో గెలవటం సహజమన్న జగన్, 13 రోజులు నంద్యాలలో తిష్టవేసి ఇంటింటికి ప్రచారం చేసినా ప్రజలు తిరస్కరించారన్నారు. జూన్‌లో ఎంపిల చేత రాజీనామా చేయిస్తానన్న జగన్మోహన్‌రెడ్డి ఇప్పుడు వౌనం దాల్చటంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.