ఆంధ్రప్రదేశ్‌

15 నుండి మున్సిపల్ కార్మికుల సమ్మె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 29: అపరిష్కృత డిమాండ్ల సాధనకై రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు సెప్టెంబర్ 15తేదీ నుంచి నిరవధిక సమ్మె చేపట్టబోతున్నారు. ఈమేర మున్సిపల్ జెఏసి నేతలు మంగళవారం ప్రభుత్వానికి తమ సమ్మె నోటీస్‌ను అందజేశారు. మున్సిపల్ కార్మికులను బానిసలుగా మార్చే 279 జివో రద్దు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఇంజనీరింగ్ కార్మికులకు స్కిల్డ్, సెమీ స్కిల్డ్ జీతాలు చెల్లించాలని, సమాన పనికి సమాన వేతనం జివో నెం.151 ప్రకారం ఎరియర్స్‌తో సహా జీతాలు పెంచి చెల్లించాలని, పర్మినెంట్ కార్మికులకు హెల్త్ కార్డులు, జీపిఎఫ్ అకౌంట్లు, విజయవాడ, విశాఖ నగరాలకు 010 పద్దు వర్తింపు, జూనియర్ అసిస్టెంట్, బిల్ కలెక్టర్, హెల్త్ అసిస్టెంట్ తదితర 852 ఖాళీ పోస్టుల భర్తీలో అర్హులైన కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులను నియమించాలని, మున్సిపల్ స్కూల్ స్వీపర్స్‌ను పుల్‌టైం వర్కర్లుగా గుర్తించాలనే డిమాండ్లపై వీరు సమ్మెకు దిగుతున్నట్టు నోటీసులో పేర్కొన్నారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పి.నారాయణ, ముఖ్య కార్యదర్శి ఆర్.కరికాలవలవన్, డిఎంఏ కె.కన్నబాబులను సచివాలయంలోని పురపాలకశాఖ మంత్రి చాంబర్‌లో కలిసి జెఏసి నేతలు తమ సమ్మె నోటీస్‌ను అందచేశారు. సెప్టెంబర్ 15లోపు తమ డిమాండ్లను పరిష్కరింకుంటే నిరవధిక సమ్మె తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జెఏసి నాయకులు కె.ఉమామహేశ్వరరావు, ఎ.రంగనాయకులు, ఇ.మధుబాబు, ఎస్.శంకరరావు, సుమన్, రాందాస్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.