ఆంధ్రప్రదేశ్‌

మడమ తిప్పిన జగన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఆగస్టు 29: మాట మార్చడం మడమ తిప్పడం తన రక్తంలోనే లేదని తరచూ చెప్పే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, నంద్యాల ఉప ఎన్నిక ఫలితం తర్వాత మాట మార్చి విమర్శలకు గురయ్యారు. ఎమ్మెల్సీగా గెలిచిన కొద్దిరోజులకే తన పార్టీలో చేరిన శిల్పా చక్రపాణిరెడ్డితో రాజీనామా చేయించి, టిడిపి మాదిరి కాకుం డా రాజకీయాల్లో నైతిక విలువలకు స్థానం కల్పించారన్న ప్రశంసలు అందుకున్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు తనతో సహా తన పార్టీలో చేరిన కాంగ్రెస్, టిడిపి ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లడం ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో దమ్మున్న నేతగా పేరు తెచ్చుకున్నారు. కానీ కేవలం ఒక ఉప ఎన్నిక ఫలితంతో మాట మార్చడం ఆయన ఇమేజ్‌ను దెబ్బతీసినట్లయింది. ఒక ఉప ఎన్నికలో ఏ పార్టీ అధ్యక్షుడు చేయనన్ని రోజులు ప్రచారం చేసిన జగన్ అందరి దృష్టినీ అటు వైపు మళ్లేలా చేశారు. 13రోజుల పాటు అవిశ్రాంతంగా పర్యటించి, తన నే అభ్యర్థిగా చూడాలన్నంత పట్టుదలతో ప్రచారం చేశా రు. ఎన్నిక ప్రచారంలో చంద్రబాబునాయుడు మూడేళ్ల పరిపాలనపై ఓటు వేస్తున్నారే తప్ప, ఒక వ్యక్తిని ఎమ్మెల్యేగా ఎన్నుకోవడానికి కాదని పలు సభల్లో జగన్ పదే పదే చెప్తూ వచ్చారు. ‘‘నంద్యాలలో మీరు వేసే ప్రతి ఓటు రానున్న మార్పునకు, వచ్చే అసెంబ్లీ ఎన్నికల కురుక్షేత్రానికి నాంది పలకబోతోంది. తద్వారా నంద్యాల ఉప ఎన్నిక రిఫరెండమేనని జగన్ తేల్చేశారు. నంద్యాల ఫలితం రెఫరెండం కాదని జగన్ వాదించారు. 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, మంత్రులను మోహరింపచేసి, జనాలను భయానికి గురిచేసి, పోలీసులను వాడుకుని ఎన్నిక జరిపిస్తే అది రెఫరెండం ఎలా అవుతుందని జగన్ ప్రశ్నించారు. ‘ఓడిన ఎవరమైనా ఫలితం తర్వాత అధికారపార్టీ దుర్వినియోగానికి పాల్పడిందని, నైతిక విజయం మాదేనంటాం. కానీ మా బాస్ తాను చెప్పిన దానిని తానే ఖం డించుకున్నారు. నిజంగా రెఫరెండమైతే పార్టీ మారిన 20 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలన్న సవాల్ బాగుంది. ప్రజలిచ్చిన తీర్పును గౌరవించి, లోపాలను సవరించుకుని ప్రజాక్షేత్రంలో ఉండి సమస్యల పరిష్కా రం కోసం ప్రభుత్వంపై పోరాడతామని చెబితే హుందాతనంగా ఉండేది.