ఆంధ్రప్రదేశ్‌

థర్మల్ విద్యుత్‌కు తగ్గుతున్న డిమాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాజువాక/పరవాడ, ఆగస్టు 29: బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్ట్‌లకు దేశవ్యాప్తంగా డిమాండ్ తగ్గుతోందని సింహాద్రి సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ (ఎన్టీపీసీ) గ్రూపు జనరల్ మేనేజర్ నరేష్‌కుమార్ సిన్హా అన్నారు. మంగళవారం పరవాడలోని సింహాద్రి దీపాంజలినగర్ సముద్రిక అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కాలుష్య రహితంగా తయారయ్యే విద్యుత్ వినియోగం పెరుగుతోందన్నారు. ప్రధానంగా సోలార్, విండ్, వాటర్ ఎనర్జీ ఉత్పత్తిని ప్రభుత్వాలు పెంచుతున్నాయన్నారు. వీటిని అభివృద్ధి చేసి కాలుష్యాన్ని పరిరక్షించే విధంగా ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయన్నారు. తమిళనాడు రాష్ట్రం అత్యధికంగా 50శాతం సోలార్, విండ్ ఎనర్జీని తయారు చేసుకుంటోందన్నారు. తమిళనాడుతో పాటు అనేక రాష్ట్రాల్లో సోలార్, విండ్ ఎనర్జీని సమకూర్చుకుంటున్నాయన్నారు.
బొగ్గు ఆథారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలతో పాటు హైడ్రాలిక్, అణువిద్యుత్ తయారీపై ప్రభుత్వాలు కాస్త వెనకడుగు వేస్తున్నాయన్నారు. ప్రభుత్వాలు సైతం సోలార్, విండ్ ఎనర్జీ తయారీకి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాయన్నారు. దీంతో పాటు సోలార్ ఎనర్జీ అభివృద్ధికి ప్రభుత్వాలు ప్రజలకు సబ్సిడీలను అందిస్తున్నాయన్నారు. సింహాద్రి పవర్ ప్రాజెక్ట్ ఆవరణలో 20 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే సోలార్ పవర్ ప్రాజెక్ట్‌ను నిర్మించే విధంగా ఎన్టీపీసీ యాజమాన్యం చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ టెండర్ స్టేజ్‌లో ఉందన్నారు. ఈ ఏడాది డిసెంబర్‌లో ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం సింహాద్రిలో తయారయ్యే విద్యుత్‌కు డిమాండ్ తగ్గిందని, ప్రస్తుతం అవసరమైన మేరకు విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం సింహాద్రి మూడు యూనిట్లు కలిసి 1500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాయన్నారు. విద్యుత్ డిమాండ్ తగ్గినప్పుడు సింహాద్రిలో ఉత్పత్తిని తగ్గిస్తున్నామన్నారు. విద్యుత్ ఉత్పత్తికి డిమాండ్ తగ్గడంతో సింహాద్రి ఈ ఏడాది పిఎల్‌ఎఫ్ కూడా 65 శాతం తగ్గింది. సింహాద్రి ప్రతీ ఏటా 85 నుండి 92 పిఎల్‌ఎఫ్‌తో విద్యుత్ ఉత్పత్తి చేసేది. కాలక్రమేణా సింహాద్రిలో పిఎల్‌ఎఫ్ తగ్గుతూ వస్తోంది. పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యం సింహాద్రికి ఉన్నప్పటికీ డిమాండ్‌కు అనుగుణంగా మూడు యూనిట్లను నడుపుతున్నామన్నారు. విలేఖరుల సమావేశంలో సింహాద్రి జనరల్ మేనేజర్ (ఓఅండ్‌ఎం) మైతి, ఎజిఎం (సిఎస్‌ఆర్) శివప్రసాద్, పిఆర్‌వోలు విజయప్రసాద్, ఎన్.మల్లయ్య పాల్గొన్నారు.

చిత్రం..సమావేశంలో మాట్లాడుతున్న సింహాద్రి గ్రూపుజనరల్ మేనేజర్ సిన్హా