ఆంధ్రప్రదేశ్‌

కోట్లకు పడగెత్తిన ఆర్‌అండ్‌బి ఎస్‌ఇ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఆగస్టు 31: ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న అభియోగాలపై గుంటూరు జిల్లా ఆర్‌అండ్‌బి ఎస్‌ఇ రాఘవేంద్రరావు నివాసాలపై ఏసిబి అధికారులు దాడులు నిర్వహించారు. ఎసిబి డిఎస్‌పి దేవానంద్ పంత్ ఆధ్వర్యంలో 9 బృందాలు గుంటూరు, సత్తెనపల్లి, తుళ్లూరు, మంగళగిరి, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రాఘవేంద్రరావు కుటుంబ సభ్యుల ఇళ్లల్లో గురువారం సోదాలు నిర్వహించి విలువైన పత్రాలు, నగలు, ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. వీటి ప్రస్తుత విలువ 20 కోట్లు రూపాయలపై చిలుకు ఉండవచ్చని అంచనా. 1988లో ఏఇఇగా ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్ విభాగంలో ఉద్యోగ బాధ్యతలు స్వీకరించిన రాఘవేంద్రరావు, ఆర్‌అండ్‌బి డిప్యూటీ ఇఇగా పనిచేసి 2012లో ఎస్‌ఇగా పదోన్నతి పొందారు. రాఘవేంద్రరావుకు రాజధాని ప్రాంతంతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఏడున్నర ఎకరాల వరకు వ్యవసాయ భూమి, బినామీ పేర్లతో ప్లాట్లు, 400 గ్రాముల బంగారం, 30 లక్షల ఇన్సూరెన్స్ పాలసీలు, 18 లక్షల విలువ చేసే టయోటా ఇన్నోవా కారు, స్కోడా, ఇతర ఖరీదైన వాహనాలతో పాటు 32 లక్షల రూపాయల విలువ చేసే వజ్రాభరణాలు, 3 కిలోల వెండి, 5.77 లక్షల నగదు, మరో 10 లక్షల విలువ చేసే గృహోపకరణాలు ఉన్నట్లు తేలింది. మంగళగిరిలో మార్కెట్ విలువ ప్రకారం 28.29 లక్షల విలువ గల 968 చదరపు గజాల స్థలాన్ని 2014లో కొనుగోలు చేశారు. 2010లో 9 లక్షల విలువ గల హోండా జాజ్ పెట్రోల్ కారు కొనుగోలు చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఆయన కుమారుడు కారంపూడి లక్ష్మీ వంశీకృష్ణ పేరిట ఫిరంగిపురం మండలం, అమీనాబాదులో య.4-28 శెంట్లు వ్యవసాయ భూమి, మరో బినామీ వల్లభనేని శ్రీనివాసచౌదరి పేరిట స్కోడా రాపిడ్ కారు, మరో బినామీ బత్తుల కిరణ్‌కుమార్ పేరిట ఇన్నోవా కారు కొనుగోలు చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 9 లక్షల మార్కెట్ విలువ గల 572.33 చదరపు గజముల భూమి, గోరంట్లలో 200 చదరపు గజాల మరో ప్లాటు, ఫిరంగిపురం మండలం అమీనాబాదులో య.1-50 శెంట్లు వ్యవసాయ భూమి, తుళ్లూరులో 52 శెంట్ల ఇళ్ల స్థలం, వెలగపూడిలో మరో 56 శెంట్లు భూమి, నెల్లూరు జిల్లా అన్నమేడులో య.1-95 సెంట్ల వ్యవసాయ భూములు ఉన్నాయి. మంగళగిరిలో 1413.16 చదరపు గజాల ప్లాటుతో పాటు మచిలీపట్నంలో 598.66 చదరపు గజాల ప్లాట్లు, గుంటూరు శ్యామలనగర్‌లో 744 చదరపు గజాల ప్లాట్లు ఉన్నాయి. అమీనాబాదులో మరో ఎకరం స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లను ఎసిబి అధికారులు స్వాధీనం చేసుకున్నారు.