ఆంధ్రప్రదేశ్‌

ఔను! ఉద్యోగులు ఇబ్బంది పడాల్సిందే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 19: హైదరాబాద్ నుంచి రాష్ట్ర రాజధాని అమరావతికి తరలి వచ్చేందుకు ఉద్యోగులకు కష్టాలు స్వాగతం పలకబోతున్నాయి. ఇక్కడికి వచ్చే ఉద్యోగులు మామూలు కష్టాలు కావు., అష్టకష్టాలు అనుభవించే పరిస్థితి ఉంది. జూన్ నెలాఖరు నాటికి సుమారు మూడు వేల మంది ఉద్యోగులు అమరావతికి వస్తారని మంత్రి నారాయణ పదేపదే చెపుతున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చే ఉద్యోగులకు సకల సదుపాయాలు కల్పిస్తామని ప్రభుత్వం చెపుతున్నా, క్షేత్ర స్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. హైదరాబాద్ నుంచి వచ్చే ఉద్యోగులు సెక్రటేరియట్‌కు దగ్గరగా ఉండాలని అనుకుంటే, కష్టాలు కొని తెచ్చుకున్నట్టే. వేలాదిగా తరలి వస్తున్న ఉద్యోగుల కోసం కొత్త కొత్త అపార్ట్‌మెంట్లను సిద్ధం చేస్తున్నారు. అయితే, ఈ అపార్ట్‌మెంట్ల యజమానల ఆశలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సుమారు రెండు వారాల కిందట డబుల్ బెడ్ రూం ఫ్లాట్ అద్దె 15 వేల రూపాయలు చెప్పినవారు ఇప్పుడు అమాంతంగా 20 వేలకు పెంచేశారు. అది కూడా వచ్చే నెల వరకూ ఇళ్ళు అద్దెకు ఇచ్చేది లేదని తేల్చి చెపుతున్నారు. అయితే ఇక్కడికి వచ్చే ఉద్యోగులంతా రాజధాని ప్రాంతంలోనే ఇళ్లు అద్దెకు తీసుకోవాలంటే, సాధ్యం కాదు. ఇప్పటికిప్పుడు వెయ్యి మంది ఉద్యోగులకు మాత్రమే ఇక్కడ ఇళ్లు దొరికే అవకాశం ఉంది. అది కూడా భారీ అద్దె చెల్లిస్తేనే.. ఇక రాజధాని ప్రాంతమైన తుళ్లూరు, ఉండవల్లి, పెనుమాక, మందడం గ్రామాల్లో ఉద్యోగులు నివసించాలనుకున్నా, ఇక్కడ వౌలిక సదుపాయాలు ఏమాత్రం లేవు. కనీసం రోడ్లు కూడా లేవు. పిల్లల్ని ప్రాథమిక, ప్రాథమికోన్న, ఉన్నత చదువులు చదివించుకోవాలంటే రాజధాని ప్రాంతంలో సాధ్యం కాదు. కార్పొరేట్ స్కూళ్లన్నీ గుంటూరు, విజయవాడల్లోనే ఉన్నాయి. పిల్లల చదువుల కోసం ఉద్యోగులు గుంటూరు, విజయవాడల్లో ఉండాల్సిందే. అక్కడే ఉండాలనుకుంటే, ప్రతి రోజు సెక్రటేరియట్‌కు వెళ్లిరావడానికి కనీసం 50 నుంచి 60 కిలో మీటర్లు ప్రయాణించాలి. అంతేకాకుండా విజయవాడలో కూడా భారీ ఇంటి అద్దెలను చెల్లించుకోవలసి ఉంటుంది. ఒకవేళ రాజధాని గ్రామాల్లోనే విధిలేని పరిస్థితుల్లో ఉండాలనుకుంటే, వైద్యం కోసం కనీసం మంగళగిరి రావాలి. లేకుంటే విజయవాడ, గుంటూరు వెళ్లాలి. ఇక్కడో ఆశ్ఛర్యకరమైన విషయం ఏంటంటే.. ఇప్పటి వరకూ ఈ గ్రామాల్లోని ప్రజలు అత్యవసర వైద్యం కోసం సొంత వాహనాలనే వినియోగించుకునే పరిస్థితి ఉంది. కనీసం అంబులెన్స్‌లు కూడా ఈ గ్రామాలకు వచ్చే అవకాశం లేదు. అత్యవసర చికిత్సకోసం సుమారు 30 కిలో మీటర్ల దూరంలో ఉన్న గుంటూరుకు కానీ, 25 కిలో మీటర్ల దూరంలో ఉన్న విజయవాడకు వెళ్లాలి. ఇది ఎంత వరకూ సాధ్యం?
రాజధాని ప్రాంతాల్లో నిత్యావసర వస్తువులు కొనుక్కోవాలనుకున్నా, మంగళగిరి, విజయవాడ, గుంటూరు వెళ్లాల్సిందే. తుళ్లూరులో తప్ప, మిగిలిన గ్రామాల్లో ఎటిఎంలు మచ్చుకైనా కనిపించవు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజధాని ప్రాంతంలో కనీసం కూరగాయలు కూడా దొరికే పరిస్థితి లేదంటే ఉద్యోగులు ఏవిధమైన ఇబ్బందులు ఎదుర్కొనబోతున్నారో అర్థం చేసుకోవచ్చు. అన్నింటికీ మించి, ఈ గ్రామాల్లో కనీసం ఉద్యోగులు భోజనం చేయడానికి కనీసం ఒక్క మెస్ కూడా లేదు. మెట్రో నగర జీవనాన్ని అనుభవించిన సెక్రటేరియట్ ఉద్యోగులు ఉన్నపళంగా గ్రామీణ వాతావరణానికి అలవాటు పడగలరా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. రాజధాని నుంచి తరలి వస్తున్న ఉద్యోగుల పిల్లల కోసం ఆయా స్కూళ్లు, కానె్వంట్‌లు, కళాశాలల్లో సీట్లు సిద్ధంగా ఉంచాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో విజయవాడ, గుంటూరుల్లో అన్ని ప్రైవేటు కానె్వంట్‌లు, కళాశాలల్లో సీట్లను బ్లాక్ చేశారు. హైదరాబాద్ నుంచి వచ్చే ఉద్యోగుల పిల్లలతో ఆయా ఖాళీలు భర్తీ చేసిన తరువాత, మిగిలిన సీట్లను స్థానికులకు ఇస్తామంటూ యచెపుతన్నాయి. విజయవాడలోని ప్రముఖ కాలేజీలు, కానె్వంట్‌లు, విద్యా సంస్థల్లో సీట్ల కోసం సుమారు ఆరు, ఏడు నెలల నుంచే చాలా మంది దరఖాస్తులు చేసుకుంటారు. కొన్ని చోట్ల అడ్వాన్స్ కూడా చెల్లిస్తుంటారు. ఈ దరఖాస్తులను మే, జూన్ నెలల్లో పరిశీలించి, సీట్లు ఇస్తుంటారు. అయితే ఇప్పుడు రాజధాని ఉద్యోగుల పిల్లల కోసం సీట్లను బ్లాక్ చేయడంతో స్థానికుల పిల్లలకు సీట్లు దొరికే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు రెండు, మూడు స్కూళ్లలో దరఖాస్తులు చేసుకుంటూ, అక్కడ కూడా అడ్వాన్స్ ఫీజులు చెల్లించే పరిస్థితి ఏర్పడింది.